భారత్ కరోనా అప్డేట్
- June 12, 2022
న్యూ ఢిల్లీ: భారత్‌లో కరోనా ఉధృతి కొనసాగుతోంది. గత వారం రోజుల క్రితం వరకు రోజుకు రెండు వేలకే పరిమితమైన కరోనా కేసులు ఇప్పుడు ఎనిమిది వేలకు చేరుకున్నాయి. శనివారం ఒక్కరోజే 8,582 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఎనిమిది వేల కేసులు దాటడం ఇది వరుసగా రెండో రోజు. శనివారం నలుగురు మరణించారు. ఇప్పటివరకు మొత్తం దేశంలో 43,222,017 కరోనా కేసులు నమోదుకాగా, 524,761 మంది మరణించారు. దేశంలో పాజిటివిటీ రేటు 4.11 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా 195 కోట్ల వ్యాక్సినేషన్ కూడా పూర్తైంది. మహారాష్ట్రలో ఒక్క రోజులోనే 2,922 కేసులు నమోదయ్యాయి.
ఒక్కరు మరణించారు. ఢిల్లీలో 795, కర్ణాటకలో 562, చత్తీస్‌ఘడ్‌లో 27, ఒడిశాలో 24 కేసులు నమోదయ్యాయి. ఈ వారం దాదాపు 20 వేల కేసులు నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నప్పటికీ నాలుగో వేవ్ వచ్చే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు. కేసుల పెరుగుదల నేపథ్యంలో కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ వంటి రాష్ట్రాలు కోవిడ్ నిబంధనల్ని అమలు చేస్తున్నాయి.
తాజా వార్తలు
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం







