‘వరల్డ్ ఆఫ్ వర్క్ సమ్మిట్‌’లో పాల్గొన్న ఎల్ఎంఆర్ఏ చీఫ్

- June 12, 2022 , by Maagulf
‘వరల్డ్ ఆఫ్ వర్క్ సమ్మిట్‌’లో పాల్గొన్న ఎల్ఎంఆర్ఏ చీఫ్

జెనీవా: లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ (LMRA) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, వ్యక్తుల అక్రమ రవాణాను ఎదుర్కోవడానికి జాతీయ కమిటీ ఛైర్మన్ జమాల్ అబ్దుల్ అజీజ్ అల్-అలావి ఇంటర్నేషనల్ లేబర్ కాన్ఫరెన్స్ ‘వరల్డ్ ఆఫ్ వర్క్ సమ్మిట్’లో పాల్గొన్నారు. ప్రభుత్వాలు, యజమానులు, కార్మికులతో సహా అన్ని పార్టీలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి అంతర్జాతీయ కార్మిక సంస్థ (ILO), సభ్య దేశాలు తీసుకోవలసిన అత్యవసర చర్యలపై సమ్మిట్ దృష్టి సారించింది. ఈ సందర్భంగా జమాల్ అబ్దుల్ అజీజ్ అల్-అలావి మాట్లాడుతూ.. ప్రపంచీకరణ, హక్కుల పరిధిలో సురక్షితమైన, ఆరోగ్యకరమైన పని విధానాలను చేర్చాలని సూచించారు. అలాగే సామాజిక న్యాయంపై ILO డిక్లరేషన్‌ కు మద్దతు ప్రకటించారు. కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి చెందుతున్న సమయంలో అన్ని పార్టీల హక్కులను పరిరక్షించడంలో బహ్రెయిన్ లేబర్ మార్కెట్ సాధించిన విజయాలను ప్రస్తావించారు. అన్ని ఉత్పత్తి పార్టీల మధ్య సహకారంతో మహమ్మారి ప్రతికూల పరిణామాలను బహ్రెయిన్ ప్రభుత్వం అధిగమించిందని పేర్కొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com