నాన్-కమ్యూనికేబుల్ డిసీజ్ రిస్క్ పై ఖతార్ సర్వే
- June 12, 2022
దోహా: దీర్ఘకాలిక నాన్-కమ్యూనికేబుల్ డిసీజెస్ (ఎన్సిడిలు) రిస్క్ కోసం రెండవ జాతీయ స్టెప్‌వైజ్ సర్వేను నిర్వహించడానికి పబ్లిక్ హెల్త్ మంత్రి డాక్టర్ హనన్ మొహమ్మద్ అల్ కువారీ, ప్లానింగ్ అండ్ స్టాటిస్టిక్స్ అథారిటీ హెడ్ డాక్టర్ సలేహ్ బిన్ మహ్మద్ అల్-నాబెట్ ఒక ఒప్పందంపై సంతకం చేశారు. 8000 ఖతారీ, నాన్-ఖతారీ కుటుంబాలపై ఈ సర్వేను నిర్వహించనున్నారు. సర్వే నిర్వహించడానికి అవసరమైన కార్యాచరణ ప్రణాళికలను అభివృద్ధి చేయాలని వారు నిర్ణయించారు. ఉత్తమ సర్వే పద్ధతులను అధ్యయనం చేయడానికి, పురోగతి నివేదికలను సిద్ధం చేయడానికి, సవాళ్లను గుర్తించడానికి నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేయనున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సహకారంతో నిర్వహించిన 2012 సర్వేకి అనుబంధంగా ఈ సర్వేని నిర్వహించనున్నారు. పొగాకు వాడకం, శారీరక శ్రమ లేకపోవడం, అనారోగ్య పోషణ, ఊబకాయం, రక్తపోటు, రక్తంలో గ్లూకోజ్ పెరగడం, రక్తంలో కొవ్వు పెరగడం వంటి ప్రమాద కారకాల నియంత్రణ కోసం జాతీయ ఆరోగ్య వ్యూహం 2030 కింద కార్యాచరణ ప్రణాళికలను అభివృద్ధి చేయనున్నట్లు డాక్టర్ హనన్ మొహమ్మద్ అల్ కువారి చెప్పారు.
తాజా వార్తలు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..







