మీ ఇంటికి రోడ్డు కావాలా.. యాప్‌లో దరఖాస్తు చేసుకోండి

- June 12, 2022 , by Maagulf
మీ ఇంటికి రోడ్డు కావాలా.. యాప్‌లో దరఖాస్తు చేసుకోండి

దుబాయ్: నివాసితులు తమ ఇంటికి తాత్కాలిక రహదారి కోసం స్మార్ట్ అప్లికేషన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని రోడ్లు, రవాణా అథారిటీ తెలిపింది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. నివాసితులు తమ ఇంటికి తాత్కాలిక గ్రావెల్ రోడ్డు వేయడానికి దరఖాస్తు చేసుకోవచ్చని అందులో తెలిపారు.Mahboub–RTA  వర్చువల్ అసిస్టెంట్‌ని ఉపయోగించి తారీజ్ సేవను పొందాలని సూచించారు. ఆరు దశల్లో ఈ సేవను పొందవచ్చని పేర్కొన్నారు. కార్పొరేట్ సేవల స్మార్ట్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసిన తర్వాత నిబంధనలు, షరతులను అంగీకరించాలి. ట్రాఫిక్, రోడ్ల ఆప్షన్ ను ఎంపిక చేసుకోవాలి. ఆపై తారీజ్ పై క్లిక్ చేయాలి. అడిగిన సమాచారాన్ని ఇవ్వాలి. అలాగే అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయాలి. ఆపై క్లిక్ చేసి దరఖాస్తు కాపీని భవిష్యత్ నిర్ధారణల కోసం సేవ్ చేసుకోవాలని సూచించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com