లగేజీ నష్టానికి విమానయాన సంస్థలదే బాధ్యత: సౌదీ
- June 13, 2022
సౌదీ: ప్రయాణీకుల లగేజీని ఆలస్యం చేసినా, పోగొట్టినా లేదా పాడైపోయినా ఎయిర్ క్యారియర్లు పరిహారం చెల్లించాలని జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (GACA) స్పష్టం చేసింది. ప్రయాణ టిక్కెట్‌ను కలిగి ఉన్న ప్రతి కస్టమర్‌కు విమాన క్యారియర్ తప్పనిసరిగా కనీసం SR1,820తో పరిహారం అందజేయాలని ఆదేశించింది. అలాగే లగేజీ నష్టం, ఆలస్యం కోసం SR6,000 వరకు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ప్రయాణికులు తమ లగేజీలో విలువైన లేదా అధిక-విలువైన వస్తువులు ఉంటే విమానం ఎక్కే ముందు వాటి గురించిన సమాచారాన్ని ఎయిర్ క్యారియర్‌కు తెలియజేయాలని జీఏసీఏ సూచించింది. కస్టమర్ల లగేజీ ఆలస్యమైన సందర్భంలో తప్పనిసరిగా పరిహారం చెల్లించాలని, ఆలస్యమయ్యే ప్రతి రోజు SR104కి సమానంగా చెల్లించాలని పేర్కొంది. దేశీయ విమానాలకు గరిష్టంగా SR520 పరిహారంగా నిర్ణయించారు. అంతర్జాతీయ విమానాల విషయానికొస్తే.. ఆలస్యమైన ప్రతి రోజు కస్టమర్లకు SR208కి సమానమైన పరిహారం చెల్లించాలని జీఏసీఏ ఆదేశించింది. నష్టపరిహారం క్లెయిమ్‌ను స్వీకరించిన తేదీ నుండి 30 రోజులలోపు కస్టమర్‌కు లగేజీ నష్టానికి ఎయిర్ క్యారియర్ పరిహారం చెల్లించాల్సి ఉంటుందని జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఆదేశించింది.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







