హౌసింగ్ స్కీమ్ ప్రయోజనం కోసం పెళ్లి నాటకం.. వ్యక్తికి జరిమానా

- June 14, 2022 , by Maagulf
హౌసింగ్ స్కీమ్ ప్రయోజనం కోసం పెళ్లి నాటకం.. వ్యక్తికి జరిమానా

బహ్రెయిన్: మజాయా హౌసింగ్ స్కీమ్ ద్వారా ఇంటిని పొందేందుకు పెళ్లి నాటకం ఆడిన వ్యక్తికి BD15,000 చెల్లించాలని బహ్రెయిన్ హైకోర్టు ఆదేశించింది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. ఓ వ్యక్తి పెళ్లి చేసుకున్నాడు. మజాయా హౌసింగ్ స్కీమ్ ద్వారా ఇళ్లు పొందాడు. ఆ తర్వాత మహిళకు విడాకులు ఇచ్చా మరో మహిళను పెండ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. దాంతో సదరు మహిళ కోర్టును ఆశ్రయించింది. ఇంటి కొనుగోలు కోసం తాను BD44,000 ఇచ్చినట్లు పేర్కొంది. ఇంటిని ఇద్దరు పేర్లపై రిజిస్టర్ చేయిస్తానని మాటిచ్చి మోసం చేసి తన పేర చేయించుకున్నాడని కోర్టుకు తెలిపింది. కేవలం మజాయా హౌసింగ్ స్కీమ్ ప్రయోజనం కోసం మాత్రమే తనను పెండ్లి చేసుకున్నాడని మహిళ ఆరోపించింది. ఈ క్రమంలో సదరు వ్యక్తి దిగొచ్చాడు. మహిళ చెల్లించిన మొత్తాన్ని అప్పు కింద తీసుకున్నట్లు.. త్వరలో ఆ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తానని కోర్టుకు తెలిపాడు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com