687 వాహనాలను వేలం వేయనున్న మునిసిపాలిటీ

- June 14, 2022 , by Maagulf
687 వాహనాలను వేలం వేయనున్న మునిసిపాలిటీ

కువైట్: కువైట్ మునిసిపాలిటీ 687 వాహనాల్ని వేలం వేయనుంది. సీల్డ్ ఎన్వలప్ ఆక్షన్ ద్వారా మినా అబ్దుల్లా గ్యారేజీ వద్ద ఈ వేలం జరుగుతుంది. మూడు విభాగాలుగా ఈ వాహనాల్ని విభజించారు. ఓ విభాగంలో 240 వాహనాలు, మరో విభాగంలో 227 వాహనాలు, మూడో విభాగంలో 220 వాహనాలు వుంటాయి. వీటన్నిటికీ నెంబర్ ప్లేట్లు వున్నాయి. మధ్యాహ్నం 12 గంటల తర్వాత జూన్ 15న ఈ వాహనాల్ని తనిఖీ చేసుకోవచ్చని మునిసిపాలిటీ సూచించింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com