మరో యాక్షన్ ఫిల్మ్‌ని సెట్ చేసిన ప్రబాస్.?
- June 14, 2022
గట్టిగా చెప్పాలంటే, ‘బాహుబలి’ సినిమా తర్వాత ప్రబాస్‌కి ఒక్క హిట్టు కూడా దక్కలేదు. కానీ, క్రేజ్ మాత్రం అస్సలు తగ్గలేదు. ఫ్లాప్ సినిమాలతో కూడా విపరీతమైన బజ్ క్రియేట్ చేస్తుండడం ప్రబాస్ గొప్పతనం. ప్రబాస్ నుంచి సినిమా వస్తుందంటే చాలు, ఆ సినిమాకి వస్తున్న ప్రీ రిలీజ్ బజ్ అంతా ఇంతా కాదు.
అలాగే, ప్రబాస్ ఓకే చేస్తున్న సినిమాల విషయంలోనూ ఆ క్యూరియాసిటీ అదే రేంజ్లో వుంటోంది. ప్రస్తుతం ప్రబాస్ చేతిలో మూడు బిగ్ ప్రాజెక్టులున్నాయి. అందులో బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ‘ఆది పురుష్’ ఒకటి. ఈ సినిమాలో కృతి సనన్ హీరోయిన్గా నటిస్తోంది.
అలాగే, ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్‌తో ‘ప్రాజెక్ట్ కె’ సినిమాలో ప్రబాస్ నటిస్తున్న సంగతి తెలిసిందే. దిశా పటానీ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. కాగా, ‘కేజీఎఫ్’ క్రేజీ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో ‘సలార్’ మూవీలోనూ ప్రబాస్ నటిస్తున్న సంగతి తెలిసిందే. శృతిహాసన్ ఇందులో హీరోయిన్.
ఇలా ఏ సినిమా తీసుకున్నా, అవన్నీ భారీ బడ్జెట్ సినిమాలే. దాదాపు 300 కోట్ల బడ్జెట్ సినిమాలే. అంటే అర్ధం చేసుకోవచ్చు ప్రబాస్ క్రేజ్ ఎలా వుందో. ‘రాధే శ్యామ్’తో పెట్టుకున్న అంచనాలు రివర్స్ అయ్యాయ్. అయినా కానీ, ప్రబాస్ మీద ఇంత బడ్జెట్ పెట్టి, ప్యాన్ ఇండియా రేంజ్‌లోనే సినిమాలు తెరకెక్కించేందుకు ముందుకొస్తున్నారు మేకర్లు. ఇదే క్రమంలో మరో బాలీవుడ్ దర్శకుడు ప్రబాస్ కోసం ఓ సరికొత్త ప్రాజెక్ట్ సెట్ చేశాడట.
ఆయన ఎవరో కాదు, బాలీవుడ్లో యాక్షన్ డైరెక్టర్‌గా పాపులర్ అయిన సిదార్ధ్ ఆనంద్. ఆయన ప్రబాస్ కోసం ఓ భారీ యాక్షన్ స్టోరీని సిద్ధం చేశాడట. ఆల్రెడీ ప్రబాస్‌కి స్టోరీ నెరేట్ చేశాడట. ప్రబాస్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు తెలుస్తోంది. మైత్రీ మూవీస్ బ్యానర్ వారు ఈ సినిమాని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారట. అయితే, ఈ సినిమాని ఎప్పుడు లాంచ్ చేస్తారనేది ఇంకా తెలియాల్సి వుంది.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







