'గంధర్వ' జూలై 1న విడుదల

- June 15, 2022 , by Maagulf
\'గంధర్వ\' జూలై 1న విడుదల

హైదరాబాద్: ఈ మధ్య కాలంలో విడుదలకు ముందే  విపరీతమైన క్రేజ్ సంపాదించుకుని టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా పేరు తెచ్చుకున్న తాజా చిత్రం గంధర్వ.ఇంతవరకు చిత్ర పరిశ్రమలో ఎవరూ టచ్ చేయని ఒక అనూహ్యమైన  కథాంశంతో రూపొంది సినీ ప్రముఖుల ప్రశంసలతో పాటు సెన్సార్ వారి అభినందనలు కూడా అందుకుంది గంధర్వ.యాంటి ఏజింగ్ అనే ఒక డిఫరెంట్  పాయింట్  తీసుకొని అద్భుతమైన ప్రజెంటేషన్ తో  తెరకెక్కిన గంధర్వ సెన్సార్ కార్యక్రమాలు ఈ రోజు జరిగాయి.ఏవో ఒకటి రెండు సూచనలు ఇవ్వడం తప్ప ఎలాంటి కట్స్ చెప్పకుండా  యు/ ఏ సర్టిఫికేట్ ఇవ్వడంతో పాటు చిత్ర దర్శకుడు అఫ్సర్ ను అభినందించారు సెన్సార్ సభ్యులు. వంగవీటి,జార్జ్ రెడ్డి ఫేం సందీప్ మాధవ్ హీరోగా గాయత్రి అర్.సురేష్ హీరోయిన్గా సాయికుమార్,సీనియర్ హీరో సురేష్,బాబు మోహన్,పోసాని కృష్ణ మురళి తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సంగీతం: ర్యాప్ రాక్ షకీల్,కెమెరా : జవహర్ రెడ్డి,ఎడిటింగ్ : బసవరాజు.కాగా ఈ సినిమా ఫస్ట్ కాపీ చూసిన ప్రముఖ ఫిల్మ్ జర్నలిస్ట్,నిర్మాత,పంపిణీదారుడు సురేష్ కొండేటి వెంటనే  హక్కులు సొంతం చేసుకొని తన ఎస్. కె. ఫిలిమ్స్ బ్యానర్ పై  ఉభయ తెలుగు రాష్ట్రాలలో జూలై 1న భారీ స్థాయిలో  రిలీజ్ చేయటానికి ముందుకు రావడం విశేషం.కాగా ఒక కొత్త దర్శకుడు రూపొందించిన గంధర్వ చిత్రం రిలీజ్ కు ముందే విపరీతమైన మౌత్ టాక్ సొంతం చేసుకొని ఒకే ఒక్క షో తో బిజినెస్ క్లోజ్ చేసుకోవటం గురించి ఇండస్ట్రీలో విశేషంగా చెప్పుకుంటున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com