పృథ్వీ-2 బాలిస్టిక్ మిస్సైల్ పరీక్ష సక్సెస్
- June 16, 2022
ఒడిశా: పృథ్వీ-2 బాలిస్టిక్ మిస్సైల్ పరీక్ష సక్సెస్ అయింది. మిస్సైల్ పరీక్షను డీఆర్డీవో విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని బాలాసోర్‌లోని ఐటీఆర్ లాంచింగ్ కాంప్లెక్స్-3 నుంచి బుధవారం (జూన్15,2022) రాత్రి 7.40 గంటలకు మిస్సైల్ పరీక్ష విజయవంతమైనట్లు రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) దేశీయంగా అభివృద్ధి చేసింది. పృథ్వీ-2 క్షిపణి 350 కిలోమీటర్ల వరకు.. 500-1000 కిలోల వరకు వార్‌హెడ్‌ను మోసుకువెళ్లే సామర్థ్యం కలిగివుంది. ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే మిస్సైల్.. 350 కిలోమీటర్ల పరిధిలోకి రేంజ్‌ను కలిగి ఉంటుంది. ఇందులో ద్రవ ఇంజిన్లు ఉన్నాయి.
ట్రైనింగ్ లాంచ్‌లో మిస్సైల్ కచ్చిత్వంతో లక్ష్యాన్ని ఛేదించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. 9 మీటర్ల పొడవు, సింగిల్-స్టేజ్ ద్రవ ఇంధనంతో పనిచేసే పృథ్వీ-2 మిస్సైల్ తొలిసారిగా 1996లో ప్రయోగించారు. 2003లో భారత సాయుధ దళాలలోకి ప్రవేశించింది. డీఆర్డీవో అభివృద్ధి చేసిన మొదటి క్షిపణి ఇదే.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







