‘విక్రమ్’‌కీ ‘ఖైదీ’కి లింకేంటబ్బా.!

- June 16, 2022 , by Maagulf
‘విక్రమ్’‌కీ ‘ఖైదీ’కి లింకేంటబ్బా.!

లోకేష్ కనగరాజ్.. ఇప్పుడీ పేరుకు పరిచయం అక్కర్లేదు. వెరీ యంగ్ డైరెక్టర్. తీసిన సినిమాలు కూడా చాలా తక్కువే. కానీ, ఆయన గురించి ఎక్కువగా మాట్లాడుకునేలా చేశాయ్ ఆ సినిమాలు. ఆ రేంజ్‌లో ఆయా సినిమాల్లోని టేకింగ్, గ్రిప్పింగ్ వున్నాయ్ మరి.

తాజాగా ‘విక్రమ్’ సినిమా తెరకెక్కించాడీ యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్. తెలుగు, తమిళంతో పాటు, పలు భాషల్లో రూపొందిన ఈ సినిమా, విడుదలైన అన్ని భాషల్లోనూ మంచి విజయం అందుకున్న సంగతి తెలిసిందే.

అయితే, ఇప్పుడు టాపిక్ ఏంటంటే, లోకేష్ తెరకెక్కించిన గత చిత్రం ‘ఖైదీ’ గుర్తుండే వుంటుంది. కార్తి హీరోగా రూపొందిన చిత్రమిది. సినిమా అంటే హీరో, హీరోయిన్, విలన్.. ఈ పాత్రలు కీలకంగా వుండాలి. కానీ, హీరోయినే లేకుండా ఈ సినిమాని తెరకెక్కించాడు లోకేష్ కనగరాజ్.
నిజంగానే ఇది పెద్ద సాహసం. అందులోనూ కార్తిలాంటి రొమాంటిక్ హీరోకి హీరోయిన్ లేకుండా అంటే, మొదట్లో ఈ సినిమా విషయంలో కాస్త నెగిటివిటీ నెలకొంది. కానీ, రిలీజ్ తర్వాత, సినిమాలోని గ్రిప్పింగ్ చూసి అటు డైరెక్టర్‌నీ, ఇటు కార్తిని కూడా మెచ్చుకోకుండా వుండలేకపోయారు.

ఏ మాత్రం బోరే కొట్టించకుండా ప్రేక్షకుల్ని కట్టి పడేశాడు ‘ఖైదీ’ సినిమాతో డైరెక్టర్. ‘విక్రమ్’ సినిమాలో ‘ఖైదీ’కి సంబంధించిన కొన్ని పాత్రల్ని లింక్ చేసి చూపించాడు. ఆయా పాత్రల గురించి అర్ధమవ్వాలంటే, ‘ఖైదీ’ మూవీ ఖచ్చితంగా చూడాల్సిందే అని మాట్లాడుకుంటున్నారు.
అసలు ఏ డైరెక్టర్ చేయని సాహసం ఇది. సీక్వెల్ సినిమాల్లోనే ఇలాంటి లింకులు కనిపిస్తుంటాయ్. అలాంటిది ఓ హీరో సినిమాకీ, ఇంకో హీరో సినిమాకీ లింకు అంటే అది కాపీగా పరిగణిస్తారు. కానీ, లోకేష్ కనగరాజ్ రూటే సెపరేటు. అందుకే ‘విక్రమ్’, ‘ఖైదీ’ లింక్ వేరే లెవల్. అన్నట్లు ప్రస్తుతం ‘ఖైదీ’కి సీక్వెల్ ప్లానింగ్‌లో లోకేష్ కనగరాజ్ బిజీగా వున్నాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com