రాశీఖన్నా.. అంతలా దిగజారిపోయిందేంటీ.?
- June 16, 2022
మారుతి డైరెక్షన్లో వచ్చిన ‘ప్రతిరోజూ పండగే’ సినిమా గుర్తుంది కదా. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా రాశీఖన్నా హీరోయిన్గా తెరకెక్కిన సినిమా ఇది. ఈ సినిమాలో హీరోయిన్ రాశీఖన్నా ‘ఏంజెల్ ఆర్నా’ పాత్రలో కనిపించింది. టిక్ టాక్ వీడియోలు చేసే యువతి పాత్ర అది.
నిజం చెప్పాలంటే అదో దిక్కుమాలిన పాత్ర. సినిమాలో బొత్తిగా ఇంపార్టెన్స్ లేని పాత్ర. అఫ్కోర్స్ సినిమా కూడా అలాంటిదే అనుకోండి. ఎలా హిట్ అయ్యిందో అయిపోయింది. అయితే, ఆ పాత్ర గురించి తాజాగా రాశీఖన్నా చాలా గొప్పగా చెప్పేసుకుంటోంది.
అప్పట్లోనే ఏంజెల్ ఆర్నా పాత్రకి మంచి రెస్పాన్స్ వచ్చేసిందట. దాంతో, డైరెక్టర్ మారుతి అప్పుడే ఆమెకు మాటిచ్చాడట. ఇంకో సినిమాలో ఛాన్సిస్తాననీ, ఆ ఛాన్స్ అలాంటిలాంటి ఛాన్స్ కాదని. అదే ఇప్పుడు ‘పక్కా కమర్షియల్’ సినిమాలో దక్కిందట రాశీ ఖన్నాకి.
ఈ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా రాశీఖన్నా, సినిమాలోని తన పాత్ర గొప్పతనం గురించి చెప్పుకుంటూ ఇదిగో పై విధంగా స్టేట్మెంట్లు ఇచ్చేస్తోంది. రాశీఖన్నా స్టేట్మెంట్లకు నెటిజనం దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.
ఏంజెల్ ఆర్నానే తట్టుకోలేకపోయామంటే, అంతకు మించి అంటే, ఇక ‘పక్కా కమర్షియల్’లో ఇంకేం అరాచకం చేశావ్ తల్లీ.! ఇలా రాంగ్ స్టేట్మెంట్లు ఇచ్చి నీ విలువ నువ్వే తగ్గించేసుకుంటున్నావ్. జర జాగ్రత్త గుమ్మా.! అంటూ హెచ్చరిస్తున్నారు.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







