వేసవిలో కార్లలో అగ్నిప్రమాదాలు.. జాగ్రత్తలు

- June 17, 2022 , by Maagulf
వేసవిలో కార్లలో అగ్నిప్రమాదాలు.. జాగ్రత్తలు

యూఏఈ: వేసవిలో కార్లలో చోటుచేసుకునే అగ్నిప్రమాదాలను నివారించేందుకు అజ్మాన్ సివిల్ డిఫెన్స్ ఓ వినూత్న కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. "ఎస్టాబ్లిష్‌మెంట్ సేఫ్టీ ఇనిషియేటివ్"లో పేరుతో కార్లలో అగ్ని ప్రమాదాలను తగ్గించడానికి ఒక అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించింది. సివిల్ అవేర్‌నెస్ డిపార్ట్ మెంట్ డైరెక్టర్ మేజర్ ఇబ్రహీం సలేమ్ అల్-హర్సౌసి మాట్లాడుతూ.. ఎస్టాబ్లిష్‌మెంట్ సేఫ్టీ ఇనిషియేటివ్ లో భాగంగా కార్లలో సంభవించే ప్రమాదాలపై కార్ షోరూమ్ యజమానులకు అవగాహన కల్పించనున్నట్లు పేర్కొన్నారు.ముఖ్యంగా వేసవిలో కార్లలో అగ్నిప్రమాద నివారణ, ప్రాణం, ఆస్తుల రక్షణ కోసం యూఏఈ స్పెసిఫికేషన్‌లకు కట్టుబడి ఉండాలని ఆయన కోరారు. ముఖ్యంగా కార్ల ఎగ్జిబిషన్‌లలో అగ్ని ప్రమాదాలను నివారించడానికి, అలాగే కార్ల మంటల రకాలను, అగ్నిప్రమాదం సంభవించినప్పుడు అనుసరించాల్సిన అవసరమైన పద్ధతులను తెలిపేలా చర్యలు చేపట్టాలని కార్ షోరూమ్ యజమానుకలు అల్-హర్సౌసి సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com