యూఏఈ: కొత్త కొవిడ్ ఆంక్షల వివరాలు...
- June 18, 2022
యూఏఈలో కూడా కొవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి.ఈ క్రమంలోనే కొవిడ్ వ్యాప్తిని అడ్డుకోవడానికి కొత్త కొవిడ్ ఆంక్షలు అమలులోకి వచ్చాయి.నివాసితులు,యూఏఈకి వెళ్లే ప్రయాణికులు కూడా తెలుసుకోవాల్సిన వివరాలు.
గ్రీన్‌పాస్‌ల కాల పరిమితి కుదింపు
రెండు డోసుల కొవిడ్ తీసుకున్న ప్రజలకు గతంలో 30 రోజుల కాల పరిమితితో కూడిన గ్రీన్‌పాస్‌లను యాప్ ద్వారా అందించేవారు. అయితే కొవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా.. గ్రీన్ పాస్ గడువును 14 రోజులకు కుదించారు. ప్రభుత్వ కార్యాలయాలు, బిల్డింగ్‌లలోకి ప్రవేశానికి గ్రీన్‌పాస్‌లు తప్పనిసరి.
మాస్క్ తప్పనిసరి
యూఏఈలో బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించడం అనేది మన ఇష్టంపై ఆధారపడి ఉంటుంది.అయితే.. ఇన్‌డోర్ ప్రదేశాల్లో మాత్రం మాస్క్ తప్పనిసరి.ఎవరైనా మాస్క్ ధరించనట్లైతే.. 3000 దిర్హాములు ఫైన్ కట్టాల్సి ఉంటుంది.
10 రోజుల ఐసోలేషన్
కొవిడ్ లక్షణాలతో సంబంధం లేకుండా.. కొవిడ్ సోకినట్లు నిర్ధారణ అయిన ప్రతి ఒక్కరూ 10 రోజులపాటు ఐసోలేషన్‌లోకి వెళ్లాలి. రెసిడెంట్లు అందరూ కొవిడ్-19 డీఎక్స్‌బీ స్మార్ట్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి.
యూఏఈ వెళ్లే ప్రయాణికులు
యూఏఈకి వెళ్లే ప్రయాణికులు రెండు డోసుల కొవిడ్ వ్యాక్సిన్ తీసుకుని.. అందుకు సంబంధించిన సర్టిఫికెట్ కూడా పొంది ఉండాలి.కొవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికెట్‌పై క్యూఆర్ కోడ్ తప్పనిసరి. ఒకవేళ వ్యాక్సిన్ తీసుకోని ప్రయాణికులు ప్రయాణానికి 48 గంటల ముందు కొవిడ్ టెస్ట్ చేయించుకుని నెగెటివ్ సర్టిఫికెట్‌ను పొంది ఉండాలి.ఈ సర్టిఫికెట్‌పై కూడా క్యూఆర్ కోడ్ తప్పనిసరి.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







