ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ విన్నర్ గా వాగ్దేవి..
- June 18, 2022
హైదరాబాద్: తెలుగు ఓటీటీ ఆహా సరికొత్త ప్రోగ్రామ్స్ తో ఎప్పటికప్పుడు అలరిస్తూనే ఉంది. ఇందులో భాగంగానే ఇటీవలే తెలుగు సింగర్స్ ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో తెలుగు ఇండియన్ ఐడల్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతో మంది సింగర్స్ పాల్గొన్నారు.తాజాగా ఈ కార్యక్రమం ఫినాలేతో పూర్తి అయింది. ఇటీవల జరిగిన తెలుగు ఇండియన్ ఐడల్ సెమి ఫైనల్స్ కి బాలయ్య బాబు గెస్ట్ గా రాగా, ఫైనల్ ఎపిసోడ్ కి మెగాస్టార్ వచ్చారు.
15 వారల సుదీర్ఘ సంగీత ప్రయాణం తర్వాత ఆహాలో శుక్రవారం నాడు ఫినాలే టెలికాస్ట్ చేసింది. మెగాస్టార్ చిరంజీవితో పాటు, రానా దగ్గుబాటి మరియు సాయి పల్లవి కూడా విచ్చేసి గ్రాండ్ ఫినాలేను సక్సెస్ చేశారు. ఫైనల్ కి అయిదుగురు కంటెస్టెంట్స్ రాగా అందులో మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా వాగ్దేవి ట్రోఫీని అందుకొని మొట్ట మొదటి తెలుగు ఇండియన్ ఐడల్ గా నిలిచింది. తెలుగు ఇండియన్ ఐడల్ విన్నర్ వాగ్దేవికి ట్రోఫీతో పాటు 10 లక్షల బహుమానం మరియు గీత ఆర్ట్స్ నుండి రానున్న సినిమాలో పాడే అవకాశం కూడా వచ్చింది.
తాజా వార్తలు
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!







