అబూ ధాబీ లో ఈ ఏడాది లక్ష ట్రాఫిక్ ఉల్లంఘనలు
- April 10, 2016
ఈ ఏడాది మొదటి త్రైమాసికంలోనే లక్షకు పైగా ట్రాఫిక్ నేరాలు తాజా గణాంకాల ప్రకారం నమోదు కాబడినట్లు అబూధాబీ పోలీస్ ట్రాఫిక్ మరియు పెట్రోలింగ్ డైరెక్టరేట్ తెలిపింది. డిప్యూటీ డైరెక్టర్, ట్రాఫిక్, పెట్రోల్స్ డైరెక్టరేట్, బ్రిగేడియర్ ఖలీఫా మొహమ్మద్ అల్ ఖిలి పేర్కొంటూ " గంటకు 60 కిలోమీటర్ల వేగం కంటే ఎక్కువ వేగంగా ప్రయాణించడం అత్యంత ప్రమాదకరమైన ఉల్లంఘన అని అన్నారు ఇది మొత్తం ఉల్లంఘనలలో14 శాతం వాటాగా ఉంది . " ఇదిలా ఉంటె , మొబైల్ ఫోన్లలో మాట్లాడుతూ మొత్తం 10 శాతం నేరాల వాటా ఉంటె , సీటు బెల్ట్ కట్టుకోకుండా వాహనాలు నడిపేవారు 18 శాతం మరియు అరిగిపోయి, పాతబడిన టైర్లతో డ్రైవింగ్ చేసేవారు 8 శాతం ఉల్లంఘనలు కలిగి ఉన్నాయి, బ్రిగేడియర్ అల్ ఖిల్ మాట్లాడుతూ మొత్తం ఉల్లంఘనలలో 78 శాతం కేసులు వీధుల్లో పోటీలు పడటంపై నమోదు కాగా భుజం పక్కనుంచి వెనుకనుండి వచ్చేవారు కష్టమైన రీతిలో అధిగమించినందుకు 3,616 ఉల్లంఘనలు; మరియు ఆకస్మికంగా దారి మళ్లింపు చేసిన 1,495 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.డ్రైవర్లు లక్ష్యంగా భద్రత ప్రణాళికలు పెరుగుతున్న అవగాహన కార్యక్రమాలు జరపడం , ట్రాఫిక్ పరిశోధన విభాగం అనుబంధంగా పౌర గస్తీ ముమ్మరం చేయడం మరియు ఎయిర్ వింగ్ శాఖ సమన్వయంతో రోడ్ల నియంత్రణ, ఎయిర్ ట్రాఫిక్ నియంత్రణ డైరెక్టరేట్ యొక్క ట్రాఫిక్ అమలు చేయనున్నాయని ఆయన వివరించారు .ముఖ్యంగా పాఠశాలలు మరియు విశ్వవిద్యాలయాల్లో అవగాహన కార్యక్రమాల ద్వారా యువకులను పోలీసులు లక్ష్యంగా పెట్టుకున్నారు . ప్రభుత్వ రంగ, ప్రభుత్వ శాఖలు, మరియు విద్యా సంస్థలు సైతం డైరెక్టరేట్ నిర్వహించే ఈ కార్యక్రమంలో పాల్గొన్నడం ద్వారా సామాజిక బాధ్యతను ప్రోత్సహించడానికి ఈ చర్యను ప్రారంభించినట్లు ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు







