చిరంజీవి కోసం ఒక్కరు కాదు, ఇద్దిరిద్దరు దర్శకులా.?
- June 18, 2022
‘ఆచార్య’ డిజాస్టర్ తర్వాత చిరంజీవి తన సినిమాల విషయంలో చాలా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆ క్రమంలోనే ఆయన సినిమాలకు ఒకరు కాదు, ఇద్దరిద్దరు డైరెక్టర్లు వర్క్ చేస్తున్నారు. ఆయన చేతిలో పూర్తి చేయాల్సిన సినిమాలు చాలానే వున్నాయి.
వాటిలో ‘గాడ్ పాదర్’ సినిమా ఓ కొలిక్కి వచ్చేసింది. ఇక మిగిలిన ‘భోళా శంకర్’, ‘వాల్తేర్ వీర్రాజు’ సినిమాల విషయంలో చిరంజీవి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారట. ఆ క్రమంలోనే ‘భోళా శంకర్’ కోసం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సలహాలు, సూచనలు తీసుకుంటున్నారని ఇన్సైడ్ సోర్సెస్ ద్వారా అందుతోన్న సమాచారం.
అలాగే ఇప్పుడు ‘వాల్తేర్ వీర్రాజు’ సినిమాకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ టాపిక్ హల్ చల్ చేస్తోంది. ఈ సినిమాకి బాబి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కూడా ఈ సినిమాకి కొన్ని ఇన్ పుట్స్ ఇస్తున్నారట. అందుకు సాక్ష్యం ఇదే.. అంటూ కొన్ని ఫోటోలు నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయ్.
‘వాల్తేర్ వీర్రాజు’ షూటింగ్ ప్రస్తుతం హైద్రాబాద్‌లో జరుగుతోంది. ఈ సినిమా సెట్స్‌లో సుకుమార్ పాల్గొన్న ఫోటోలు నెట్టింట్లో దర్శనమిస్తున్నాయి. వీటిని చిత్ర యూనిట్టే తమ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయడం విశేషం.
దాంతో అనుమానాలు నిజమనేంతలా ఫ్యాన్స్‌లో అంచనాలు పెరిగిపోయాయి. సుక్కు డైరెక్షన్‌తో బాబీ సినిమాలోని కొన్ని కీలక మార్పులు చేస్తున్నారనీ తెలస్తోంది. ఈ సినిమాలో మెగాస్టార్‌కి జోడీగా శృతిహాసన్ నటిస్తోంది. మాస్ రాజా రవితేజ ఓ ఇంపార్టెంట్ రోల్ పోషిస్తున్నాడనీ సమాచారం.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







