తెలుగు సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తోన్న నగ్మా.. అక్కడ దుకాణం కట్టేసినట్లేనా.?

- June 18, 2022 , by Maagulf
తెలుగు సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తోన్న నగ్మా.. అక్కడ దుకాణం కట్టేసినట్లేనా.?

ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన ముద్దుగుమ్మ నగ్మా. హీరోయిన్‌గా బోలెడన్ని సూపర్ హిట్టు సినిమాల్లో నటించింది సీనియర్ హీరోయిన్ నగ్మా. ఆ తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పేసి,  రాజకీయాల్లో బిజీ అయిపోయింది.

కాంగ్రెస్ పార్టీ తరపున రాజకీయాల్లో చాలా కష్టపడింది. అయితే, కాంగ్రెస్ పార్టీ నగ్మా సేవలను గుర్తించలేదు. రాజ్యసభ సీటు ఇప్పిస్తుందని కాంగ్రెస్ పార్టీపై చాలా ఆశలు పెట్టుకుంది నగ్మా. ఎంత చేసినా పాపం నగ్మాని లైట్ తీసుకుంది కాంగ్రెస్ పార్టీ.

దాంతో తన తప్పు తెలుసుకుందట నగ్మా. సినిమాల్లో వుండి వుంటే, ఎన్నో మంచి పాత్రలతో అభిమానులకు దగ్గరయ్యేదాన్ని. రాజకీయాల్లోకి వచ్చి, ఫేమ్ తగ్గించుకున్నాననీ రియలైజ్ అయ్యిందట. దాంతో తిరిగి సినిమాలనే నమ్ముకోవాలని డిసైడ్ అయ్యిందట.
ఆ క్రమంలోనే సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చే ఆలోచనలు చేస్తోందట నగ్మా. తమిళ, తెలుగు సినిమాల్లో ఛాన్సుల కోసం ఆల్రెడీ ప్రయత్నాలు స్టార్ట్ చేసిందట. అన్నట్లు 2002లో ఎన్టీయార్ సినిమాలో అత్త పాత్రలో నగ్మా కనిపించిన సంగతి తెలిసిందే. అదే ‘అల్లరి రాముడు’ సినిమా.
ఆర్తీ అగర్వాల్, గజాలా హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో హీరోయిన్లకు తల్లిగా ఎన్టీయార్‌కి స్టైలిష్ అత్తగా నటించి ప్రేక్షకుల మన్ననలు పొందింది నగ్మా. అలాగే, ఇప్పుడు ఆమె సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిందంటే, అలాంటి బ్యూటిఫుల్ సీనియర్ రోల్స్ చాలానే క్రియేట్ చేసేస్తారు మన ఫిలిం మేకర్లు. అంతేగా. అంతేగా.!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com