కొత్త బిజినెస్ స్టార్ట్ చేసిన ‘మనసంతా నువ్వే’ హీరోయిన్.!
- June 18, 2022
‘మనసంతా నువ్వే’ సినిమాలో హీరోయిన్‌గా నటించిన ముద్దుగుమ్మ గుర్తుంది కదా. పేరు రీమా సేన్. ఈ సినిమాతో యూత్‌కి బాగా కనెక్ట్ అయిపోయిందీ అందాల భామ. ఆ తర్వాత పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించింది రీమా సేన్.
యంగ్ హీరోలతో పాటు, మాస్ రాజా రవితేజ వంటి ఓ మోస్తరు స్టార్ హీరోల సరసన కూడా నటించిన రీమాసేన్, మెగాస్టార్ చిరంజీవితో ‘అంజి’ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్‌లోనూ నటించి, మెప్పించింది.
అయితే, ఇప్పుడు రీమా సేన్ ఏం చేస్తున్నట్లు.? సినిమాలకు బ్రేకిచ్చేసి, పెళ్లి చేసుకుని సెటిలైపోయింది. ఆమె భర్త ఓ పెద్ద బిజినెస్ మేన్. పేరు శివ్ కరణ్ సింగ్. పెళ్లి తర్వాత రీమా సేన్ కూడా భర్తతో కలిసి బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటోందట.
ఫుడ్ బిజినెస్‌లో దాదాపు రెండు దశాబ్ధాల అనుభవం వుందట శివ్ కరణ్ సింగ్‌కి. ఆ అనుభవంతోనే చాలా చోట్ల బ్రాంచ్‌లు ఓపెన్ చేశారట. తాజాగా గోవాలో సరికొత్త ఫుడ్ బిజినెస్‌కి శ్రీకారం చుట్టబోతున్నారట రీమాసేన్ దంపతులు. ఆలోచన వచ్చిందే తడవుగా, ఓ రెస్టారెంట్‌ని స్టార్ట్ చేశారట.
‘సుక్కా’ అనే పేరుతో ఓపెన్ అయిన ఆ రెస్టారెంట్‌లో మెనూ దగ్గర్నించి, ఇంటీరియర్ యాంబియెన్స్ అంతా రీమా సేనే సొంతంగా డిజైన్ చేసిందట. అంతేకాదు, గోవాలోని రెస్టారెంట్లన్నింట్లోనూ ఈ రెస్టారెంట్ చాలా చాలా ప్రత్యేకంగా వుండబోతోందని రీమా సేన్ చెబుతోంది.
తాజా వార్తలు
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు







