కార్మికులకు జీతాల వివాదాల పరిష్కారానికి కొత్త కమిటీ

- June 21, 2022 , by Maagulf
కార్మికులకు జీతాల వివాదాల పరిష్కారానికి కొత్త కమిటీ

యూఏఈ: యజమానులు, కార్మికుల మధ్య ఆర్థిక వివాదాలను పరిష్కారానికి కొత్త కమిటీని ఏర్పాటు చేసినట్లు మానవ వనరులు, ఎమిరేటైజేషన్ మంత్రిత్వ శాఖ (MoHRE)  ప్రకటించింది. 50 ఏళ్లు దాటిన కార్మికుల ఆర్థిక హక్కులకు సంబంధించిన సామూహిక కార్మిక వివాదాలను ఈ కమిటీ పరిశీలించనుంది. కార్మిక సంబంధాలను నియంత్రించే చట్టం, దాని కార్యనిర్వాహక నిబంధనలకు అనుగుణంగా కార్మిక వివాదాల శాసన, సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేసే ఫ్రేమ్‌వర్క్ లో కమిటీని ఏర్పాటు చేసినట్లు మానవ వనరుల వ్యవహారాల తాత్కాలిక అండర్ సెక్రటరీ ఖలీల్ ఖౌరీ చెప్పారు. MoHRE అధ్యక్షతన ఉండే ఈ కమిటీలో అప్పీల్ కోర్టు న్యాయమూర్తి, వాణిజ్య-పరిశ్రమల మండలి ప్రతినిధి, స్థానిక లేబర్ కమిటీ లేదా లేబర్ క్రైసిస్ టీమ్ నుండి ఒక ప్రతినిధితో సహా సంబంధిత అధికారుల నుండి ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. ఫిర్యాదు అందిన 30 రోజుల్లో పరిష్కారం చూపేందుకు కమిటీ ప్రయత్నిస్తుందని ఖౌరీ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com