హజ్ ఉద్యోగాల కోసం రిజిస్ట్రేషన్ ప్రారంభించిన సౌదీ
- June 22, 2022
సౌదీ: వచ్చే నెల హజ్ తీర్థయాత్ర సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో ముస్లిం యాత్రికులకు సేవలను అందించే ఉద్యోగాల కోసం సౌదీ అధికారులు రిజిస్ట్రేషన్ ప్రారంభించారు. హజ్, ఉమ్రా మంత్రిత్వ శాఖ సీజనల్ ఉద్యోగాలకు దరఖాస్తుదారుల కోసం నిబంధనలను జారీ చేసింది. సౌదీ జాతీయులు, అవసరమైన అర్హతలు, అనుభవం కలిగి ఉండాలని, కనీసం 24 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలని అందులో పేర్కొన్నారు. దరఖాస్తుదారులు శారీరకంగా, ఆరోగ్యంగా అర్హత కలిగి ఉండాలని, ఇంటర్వ్యూలో ఉత్తీర్ణులైన వారిని ఎంపిక చేస్తామని తెలిపింది. గతంలో సేవలందించిన వారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. డ్రైవింగ్ ఉద్యోగాల కోసం దరఖాస్తుదారులు రవాణా లైసెన్స్ కలిగి ఉండాలని, అలాగే పర్షియన్, ఉజ్బెక్, చైనీస్, ఉర్దూ, టర్కిష్ వంటి భాషల్లో మంచి పట్టు ఉన్నవారికి అధిక ప్రాధాన్యత ఉంటుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!