డ్రైవింగ్ వృత్తిలో సంస్కరణలు అమలు చేసేందుకు సంస్థల భాగస్వామ్యం కోరిన Qiwa
- June 22, 2022
రియాద్: డ్రైవింగ్ వంటి అసంఘటిత వృత్తుల్లో సంస్కరణలు అమలు చేసే లక్ష్యంతో పనిచేస్తున్న మానవ వనరుల మరియు సామాజిక అభివృద్ధి మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న Qiwa సంస్థ కొన్ని సవరణలు ప్రవేశపెట్టింది.వాటి అమల్లో భాగంగా తమ కింద పనిచేసే డ్రైవర్లకు అమలు చేయాలని పరిశ్రమలను, పారిశ్రామిక సంస్థలను ఆదేశించింది. ఇందులో భాగంగా పబ్లిక్ వాహనాల డ్రైవర్, పబ్లిక్ డ్రైవర్, ఆర్డినరీ డ్రైవర్ వంటి పలు రకాల విభిజనలు చేయడం జరిగింది.
నూతన సవరణల ప్రకారం , ఒక సంస్థ తన నిర్దిష్ట కార్యకలాపాల్లో భాగంగా సంభందిత రంగానికి చెందిన డ్రైవర్ ను ఎంచుకోవలసి ఉంటుంది వాటిలో ముఖ్యమైనవి " రైల్ , మోటార్ సైకిల్ , కారు, టాక్సీ , అంబులెన్స్, మినీ ట్రాక్ , బస్సు మరియు ఇతరత్రా వాహనాలు".
వృత్తుల్లో సంస్కరణలు అమల్లో భాగంగా సంఘటిత, అసంఘిత రంగాల్లో ఉన్నటువంటి వృత్తులను వేరు చేయాలని భావించిన Qiwa సంస్థ అందులో భాగంగానే తన సంఘటిత రంగానికి చెందిన డాక్టర్, ఇంజనీరింగ్ నిపణులు మరియు ఇతరత్రా వృత్తులను తన వెబ్సైట్ నుంచి తొలగించింది. ప్రస్తుతం ఈ సామాజిక మాధ్యమ వేదికలో అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికుల యొక్క వృత్తులు మాత్రమే ఉన్నాయి.
ఒక వేళ ఈ అసంఘటిత రంగంలో ఉన్న వృత్తుల జాబితాలో పనిచేస్తున్న ఉద్యోగి తను పనిచేస్తున్న వృత్తి నుండి వేరొక వృత్తిలోకి మారే ముందు సంబధిత ప్రాసెస్ వేగవంతంగా పూర్తి చేసేందుకు రుసుముగా SR 2,000 చెల్లించాలని Qiwa తన వెబ్సైట్ లో పేర్కొంది.
కానీ సంఘటిత రంగానికి చెందిన వృత్తుల్లో మార్పు కోసం రుసుము చెల్లింపులో మినహాయింపు ఇవ్వడం జరుగుతుంది.వెబ్సైట్ లో తొలగించిన వృత్తులకు సంబంధించిన మార్పు కొరకు ఒకసారి ఏటువంటి రుసుములు చెల్లించకుండా అనుమతించబడుతుంది.అయితే మరో సారి వృత్తి మార్పు కోసం మాత్రం ఖచ్చితంగా రుసుము తప్పనిసరిగా చెల్లించాలని పేర్కొనడం జరిగింది.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?