కార్మికులకు అనుకూలంగా తీర్పు.. SR28 మిలియన్ల చెల్లింపులు
- June 24, 2022
రియాద్: రియాద్‌లోని లేబర్ కోర్టు 149 మంది ఉద్యోగులకు అనుకూలంగా తీర్పును వెలువరించింది. 10 దేశాలకు చెందిన ఉద్యోగులు, వారి ఆర్థిక హక్కులను డిమాండ్ చేస్తూ తమ క్లాస్ యాక్షన్ దావాను దాఖలు చేశారు.ఇందులో ఆలస్యమైన జీతాలు, ఎండ్-ఆఫ్-సర్వీస్ గ్రాట్యుటీతో పాటు లభించని సెలవుల వేతనాలు ఉన్నాయి. ఉద్యోగులు ఏప్రిల్ 22న తమ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. మొదటి బ్యాచ్ 119 మంది ఉద్యోగులకు మే 12న కోర్టు తీర్పు వెలువరించగా, 30 మంది ఉద్యోగులతో కూడిన రెండో గ్రూప్‌పై మే 22న తీర్పు వెలువడింది. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు.. కార్మికులకు అనుకూలంగా తీర్పునిచ్చింది. సదరు కార్మికులకు ఆయా కంపెనీలు SR28 మిలియన్ల విలువైన ఫైనాన్షియల్ క్లెయిమ్‌లను క్లియర్ చేయాలని కోర్టు తన తీర్పులో ఆదేశించింది. న్యాయ మంత్రిత్వ శాఖ Najiz.sa పోర్టల్ ద్వారా ఎలక్ట్రానిక్‌గా లేబర్ కోర్టులలో కేసులను దాఖలు చేయడానికి కార్మికులకు వీలు కల్పిస్తోంది. కార్మిక చట్టానికి లోబడి లేదా గృహ కార్మికుల క్లెయిమ్‌లు, సబ్స్క్రిప్షన్, రిజిస్ట్రేషన్, నష్టపరిహారానికి సంబంధించి జనరల్ ఆర్గనైజేషన్ ఫర్ సోషల్ ఇన్సూరెన్స్ (GOSI) జారీ చేసిన నిర్ణయాలకు వ్యతిరేకంగా యజమానులు, కార్మికుల ఫిర్యాదులు ఇందులో ఫిర్యాదు చేయవచ్చని న్యాయశాఖ పేర్కొంది.
తాజా వార్తలు
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో 'దిస్ ఈస్ యువర్ రోల్' ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!