భార్య పై కోపంతో కుమారుడితో సహా భర్త ఆత్మహత్య
- June 24, 2022
బహ్రెయిన్: భార్యపై కోపంతో కుమారుడిని చంపి, తాను ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇండియాలోని కేరళలో చోటు చేసుకుంది. మృతులను కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం జిల్లాకు చెందిన ప్రకాష్ దేవరాజన్ (48), అతని కుమారుడు శివదేవ్‌గా గుర్తించారు. తన 11 ఏళ్ల కుమారుడిని కారులో తీసుకెళ్లిన ప్రకాశ్.. డీజిల్ ట్యాంకర్ లారీని ఢీకొట్టి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అంతకుముందు తమ మరణానికి తన భార్య, స్నేహితులే కారణమంటూ ప్రకాష్ తన సూసైడ్ నోట్ ను ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. ప్రకాష్ భార్య బహ్రెయిన్ లో ఉంటుంది. ఆమె ఇండియాకు తిరిగి రావాలని కోరుకున్నాడు. కానీ, ఆమె అతని మాట వినకపోవడంతో.. కుమారుడితో సహా తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు.ఈ మేరకు ప్రకాష్ రాసిన సూసైడ్ నోట్‌లో పేర్కొన్నారు. ఈ దంపతులకు ఒక కుమార్తె కూడా ఉంది.ఈ ఘటనపై కేరళ పోలీసులు విచారణ జరుపుతున్నారు.
తాజా వార్తలు
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!







