నవంబర్ 15 నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాగులు బంద్
- June 24, 2022
దోహా: ఖతార్లో నవంబర్ 15 నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాగుల వినియోగాన్ని నిషేధించనున్నట్లు మునిసిపాలిటీ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. సంస్థలు, కంపెనీలు, షాపింగ్ కేంద్రాలు నవంబర్ 15 నుండి అన్ని రకాల ఉత్పత్తులు, వస్తువులను ప్యాకేజింగ్ చేయడం, ప్రదర్శించడం, సర్క్యులేట్ చేయడం, మోసుకెళ్లడం లేదా రవాణా చేయడంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాగ్లను ఉపయోగించడాన్ని నిషేధిస్తున్నట్లు మునిసిపాలిటీ మంత్రిత్వ శాఖ తెలిపింది. వీటి స్థానంలో బయోడిగ్రేడబుల్ బ్యాగ్లు, కాగితంతో చేసిన బ్యాగ్లు లేదా క్లాత్ బ్యాగులు, ఇతర బయోడిగ్రేడబుల్ మెటీరియల్లతో తయారు చేసిన బ్యాగులను వాడాలని సూచించింది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాగుల వినియోగంపై నిర్వహించిన కాన్ఫరెన్స్ లో మునిసిపాలిటీ మంత్రిత్వ శాఖలోని లీగల్ అఫైర్స్ డైరెక్టర్ అహ్మద్ యూసఫ్ అల్ ఇమాది, వేస్ట్ రీసైక్లింగ్ అండ్ ట్రీట్మెంట్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ ఎంగ్ హమద్ జాసిమ్ అల్ బహర్, అల్ వక్రా మునిసిపాలిటీ డైరెక్టర్ ఇంజి ముహమ్మద్ హసన్ అల్ నుయిమి, పలువురు మంత్రిత్వ శాఖ అధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు







