షాకింగ్ న్యూస్: రాజుగారూ.. మీరు పూర్తిగా మారిపోయారు.!

- June 24, 2022 , by Maagulf
షాకింగ్ న్యూస్: రాజుగారూ.. మీరు పూర్తిగా మారిపోయారు.!

ఎవరీ రాజుగారు అనుకుంటున్నారా.? ఆయనేనండీ ఎమ్ ఎస్ రాజుగారు.ప్రముఖ నిర్మాత. ఆయన నిర్మాణంలో ‘మనసంతా నువ్వే’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ వంటి అద్భుతమైన దృశ్య కావ్యాలెన్నో రూపొందాయి.అయితే, ఈ మధ్య ఆయన నిర్మాణానికి చెక్ పెట్టేసి, డైరెక్షన్‌పై ఫోకస్ పెట్టారు.

గతంలో ‘తూనీగా తూనీగా’, ‘వాన’ వంటి సినిమాలు తెరకెక్కించి డైరెక్టర్‌గానూ మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే, రీసెంట్‌గా ‘డర్టీ హరి’ అను ఓ అడల్ట్ మూవీ తీసి విమర్శల పాలయ్యారు.అలాగే, తాజాగా ఆయన మరో అడల్ట్ అద్భుతాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.

అదే ‘సెవెన్ డేస్ సిక్స్ నైట్స్’. ఆయన ముద్దుల తనయుడు సుమంత్ అశ్విన్ ఈ సినిమాలో హీరోగా నటించాడు. ప్రమోషన్లు చూస్తే, ఇదో అడల్ట్ మూవీనే అని అర్ధమవుతోంది. కానీ, అసలు కథ, కాకరకాయ్ ఏంటనేది సినిమా చూస్తే అర్ధమవుతుందనుకోండి.
అయితే, ప్రస్తుతం రాజుగారు రికార్డులపై కన్నేసినట్లు తెలుస్తోంది. ఓ డిఫరెంట్ కాన్సెప్టున్న సినిమాకి రంగం సిద్ధం చేస్తున్నారట. ఆ సినిమాని ఏకంగా 14 భాషల్లో రూపొందిస్తారట ఎమ్ ఎస్ రాజు. వామ్మో ఇది పెద్ద సాహసమే. ఆ సినిమాకి డైరెక్షన్ దగ్గర్నుంచి, నిర్మాణం వరకూ ఆయనే బాధ్యత తీసుకుంటానని చెబుతున్నారు.

అంత నమ్మకంగా చెబుతున్నారంటే అదేదో ఖచ్చితంగా రికార్డు బ్రేకింగ్ మూవీనే అవుతుంది. అయితే, ఆయన గతంలో రూపొందించిన మూవీకే ఇది సీక్వెల్‌గా రూపొందబోతోందన్న ప్రచారం జరుగుతోంది. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com