పాకిస్తాన్ మాజీ ప్రధాని బెడ్ రూంలో సీక్రెట్ కెమెరా..
- June 26, 2022
పాకిస్తాన్: పాకిస్తాన్ మాజీ ప్రధాని బెడ్ రూంలో సీక్రెట్ కెమెరా పెడుతూ దొరికిపోయాడో వ్యక్తి. స్థానిక మీడియా కథనం ప్రకారం.. అతని ఇంట్లో పనిచేసే వ్యక్తే సీక్రెట్ డివైజ్ ఇన్‌స్టాల్ చేస్తుండగా పట్టుబడ్డాడు. బయట వ్యక్తులెవలు డబ్బులిచ్చి ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది. మరో ఉద్యోగి సెక్యూరిటీ టీంకు సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
బనీ గలా సెక్యూరిటీ టీం ఉద్యోగిని విధుల్లో నుంచి తొలగించడంతో పాటు ఫెడరల్ పోలీసులకు అప్పగించారు.
పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) ఛైర్మన్‌ను హత్య చేసేందుకు కుట్ర పన్నుతున్నారనే పుకార్ల మధ్య ఈ పరిణామం చోటు చేసుకుంది. అంతకుముందు వచ్చిన ఆరోపణలు దృష్ట్యా నగరంలోని బని గాలా పరిసర ప్రాంతాలలో భద్రతా ఏజెన్సీలు హై అలర్ట్ అయ్యాయి. ఇమ్రాన్ ఖాన్ ప్రాణాలకు ముప్పు ఉందని పలువురు పేర్కొంటున్నారు.
“ఈ విషయంలో, ప్రభుత్వంతో సహా అన్ని సంబంధిత ఏజెన్సీలకు సమాచారం అందించాం” అని షెహబాజ్ గిల్ తెలిపారు.
మీడియా పోర్టల్‌తో మాట్లాడిన షెహబాజ్ గిల్.. “గదిని శుభ్రపరిచే ఉద్యోగి సీక్రెట్ పరికరాన్ని ఇన్‌స్టాల్ చేయడానికి డబ్బు తీసుకున్నాడు” అని పేర్కొన్నారు. ఈ చర్యను ‘హీనమైనది, దురదృష్టకరం’ అని అభివర్ణించారు.
తాజా వార్తలు
- కువైట్‌లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







