డ్రైవింగ్‌లో ఉన్నప్పుడు ఈ తొమ్మిది తప్పులు అస్సలు చేయకండి..

- June 26, 2022 , by Maagulf
డ్రైవింగ్‌లో ఉన్నప్పుడు ఈ తొమ్మిది తప్పులు అస్సలు చేయకండి..

యూఏఈ: యూఏఈ రవాణాశాఖ వాహనదారులకు కీలక సూచన చేసింది.వాహనాలతో రోడ్డు పైకి వచ్చేవారు జాగ్రత్తగా ఉండాలని, ట్రాఫిక్ రూల్స్ తూచతప్పకుండా పాటించాలని ఆదేశించింది.లేనిపక్షంలో భారీ జరిమానాతో పాటు లైసెన్స్‌పై బ్లాక్ పాయింట్స్ వేయడం జరుగుతుందని హెచ్చరించింది.ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడే వాహనదారులకు యూఏఈ ఫెడరల్ ట్రాఫిక్ లా ప్రకారం జరిమానాలు విధించడం జరుగుతుందని అబుధాబి ట్రాఫిక్ పోలీస్ అధికారులు తెలిపారు. ప్రధానంగా తొమ్మిది ఉల్లంఘనలకు సంబంధించిన జరిమానాలను ఈ సందర్భంగా అధికారులు వెల్లడించారు.

1. వేగ పరిమితిని దాటి అతివేంగంగా డ్రైవ్ చేయడం

వేగ పరిమితి ఉన్న ప్రాంతాల్లో 50 కి.మీ/గం.ను మించి డ్రైవింగ్ చేస్తూ పట్టుబడిన వాహనదారులకు 1,000 దిర్హామ్‌లు జరిమాన ఉంటుంది. 60కి.మీ/గం. అని సైన్ బోర్డ్స్ ఉన్న ఎవరైనా వానహదారులు 100 ప్లస్ స్పీడ్‌తో పట్టుబడితే ఈ జరిమానా కట్టాల్సి ఉంటుంది. 

2. కారు ప్రమాదం జరిగినచోట గుమ్మిగూడడం

ఒకవేళ మీరు వాహనంలో వెళ్తున్న సమయంలో ఏదైనా కారు ప్రమాదం జరిగినట్టు గమనించి వెంటనే మీ వాహనాన్ని అక్కడే ఆపేసి ప్రదమాదాస్థలి వద్ద వెళ్లి గుమ్మిగూడకూడదు. అలాంటివి చూస్తే వెంటనే 999 నం.కు కాల్ చేసి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. అలా చేయకుండా మీ వాహనాన్ని అక్కడే ఆపేయడం వల్ల మరికొన్ని వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడవచ్చు. ఇలా ట్రాఫిక్ నిలిచిపోవడానికి కారణమైతే అప్పుడు కూడా 1000 దిర్హాములు జరిమానా చెల్లించాలి. 

3. ఓవర్ టేకింగ్ 

కొందరు కావాలని ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేసే సమయంలో ప్రమాదాలకు కారణమవుతుంటారు. ఇలాంటి సందర్భంలో కూడా వాహనదారులకు 1000 దిర్హాములు ఫైన్ ఉంటుందని అబుదాబి ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు.

4. నిర్ణయాత్మక వ్యక్తుల కోసం ప్రత్యేకించబడిన ప్రదేశంలో పార్కింగ్

కొందరు నిర్ణయాత్మక వ్యక్తుల కోసం ప్రత్యేకంగా కేటాయించిన పార్కింగ్ ప్రదేశంలో వాహనాలు పార్క్ చేసిన వాహనదారులకు వెయ్యి దిర్హాములు జరిమానాతో పాటు 6 బ్లాక్ పాయింట్స్ ఇవ్వడం జరుగుతుంది.

5. స్కూల్ బస్‌స్టాప్‌ల వద్ద ఉన్న 'స్టాప్' సైన్ల వద్ద వాహనాలు ఆపకుండా తీసుకెళ్లడం

ఈ ఉల్లంఘనకు పాల్పడిన వాహనదారులకు 1000 దిర్హాములు జరిమానాతో పాటు 10 బ్లాక్ పాయింట్స్ ఇస్తారు.

6. రెడ్ సిగ్నల్ జంపింగ్

వేగంగా వెళ్తూ రెడ్ సిగ్నల్ జంప్ చేసిన వారికి వెయ్యి దిర్హాములు జరిమానా, 12 బ్లాక్ పాయింట్స్ వేస్తారు. అలాగే 30 రోజుల పాటు వాహనం జప్తు చేస్తారు. ఒకవేళ 30 రోజుల కంటే ముందే వాహనాన్ని విడిపించుకోవాలంటే 3వేల దిర్హాములు చెల్లించాల్సి ఉంటుంది. ఇదే ఉల్లంఘనకు అబుధాబి 2020లో తీసుకువచ్చిన లా నం.05 ప్రకారం జప్తులో ఉన్న వాహనాన్ని విడిపించేందుకు ఏకంగా 50వేల దిర్హాములు చెల్లించాలనే నిబంధన ఉంది.

7. కారు నుండి చెత్త పడేయడం

కారులో వెళ్తున్న సమయంలో లోపలి నుంచి చెత్త రోడ్డుపై పడేయడం చేస్తే 1000 దిర్హాములు జరిమానా, 6 బ్లాక్ పాయింట్స్ వేస్తారు.

8. సడెన్‌గా వాహనాన్ని తిప్పడం

రోడ్డుపై వెళ్తున్న సమయంలో సడెన్‌గా వాహనాన్ని తిప్పడం వల్ల వెనుక నుంచి వచ్చే వాహనదారులు గందరగోళానికి గురై ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఇలాంటి ఉల్లంఘనకు పాల్పడితే కూడా వెయ్యి దిర్హాములు ఫైన్ ఉంటుందని అబుధాబి ట్రాఫిక్ పోలీస్ విభాగం వెల్లడించింది.

9. రోడ్డు మధ్యలో వాహనం ఆపడం

కారణం లేకుండా రోడ్డు మధ్యలో వాహనం ఆపడం చేస్తే 1000 దిర్హాములు ఫైన్ ఉంటుంది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com