అలియా భట్ తల్లి కాబోతోంది.!
- June 27, 2022
బాలీవుడ్ భామ అలియా భట్.. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకీ సుపరిచితురాలే. రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో ‘సీత’ పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని పొందింది.
ఏప్రిల్‌లో అలియా భట్, తన ప్రియుడు రణ్‌బీర్ కపూర్‌ని వివాహం చేసుకున్న సంగతి తెలిసిన న్యూసే. వివాహానంతరం వైవాహిక జీవితాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూనే, మరో పక్క ఎవరి సినిమాలతో వాళ్లు కెరీర్ పరంగానూ బిజీగా గడుపుతున్నారు.
అయితే, బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, అలియా భట్ తల్లి కాబోతోందట. అంటే, ఇప్పుడీ జంట త్వరలోనే తమ జీవితంలోకి ఓ కొత్త అతిధిని ఆహ్వానించబోతున్నారన్నమాట. ఈ విషయాన్ని అలియా భట్ స్వయంగా తన సోషల్ మీడియా వేదికగా రివీల్ చేసింది.
‘అవర్ బేబీ కమింగ్ సూన్..’ అంటూ క్యాప్షన్ ఇచ్చి, హాస్పిటల్‌లో స్కానింగ్ చేయించుకుంటున్న ఫోటోని షేర్ చేసింది. అలాగే, తల్లి సింహం, పిల్లల సింహాలతో కలిసి వున్న ఫోటోని కూడా అలియా షేర్ చేసింది. అలియా ప్రెగ్నెన్సీ విషయం తెలిసి, ఆమె అభిమానులు ఇన్ స్టా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
కెరీర్‌లో ఇంత బిజీగా వున్నా, అలియా భట్, మాతృత్వాన్ని వాయిదా వేసుకోకుండా, మనస్పూర్తిగా ఆహ్వానించడాన్ని, పలువురు సెలబ్రిటీలు ప్రశంసిస్తున్నారు. ఇదిలా వుంటే, పెళ్లయ్యి మూడు నెలలు కూడా కాకుండానే అలియా అప్పుడే తల్లి అయిపోయిందా.? అంటూ కొందరు నాటీ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ష్..! గప్‌చుప్.!
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..