టిపిసిసి ఎన్నారై సెల్ గల్ఫ్ కన్వీనర్ గా సింగిరెడ్డి నరేష్ రెడ్డి
- June 27, 2022
హైదరాబాద్: జగిత్యాల జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షులు సింగిరెడ్డి నరేష్ రెడ్డి ని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) ఎన్నారై సెల్ గల్ఫ్ కన్వీనర్ గా నియమితులయ్యారు.కాంగ్రెస్ పార్టీ ప్రవాస భారతీయుల విభాగం చైర్మన్ డా.బి .ఎం.వినోద్ కుమార్ సోమవారం (27.06.2022) నాడు ఈమేరకు నియామక పత్రాన్ని గాంధి భవన్ లో అందజేశారు.
ఈ సందర్బంగా నరేష్ రెడ్డిని పిసిసి అధ్యక్షులు ఎ.రేవంత్ రెడ్డి గాంధీ భవన్లోని తన చాంబర్ లో అభినందించారు.గల్ఫ్ కార్మికుల హక్కుల కోసం కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది... గల్ఫ్ కార్మికుల బాధలు తీరుస్తుందని అన్నారు.
నరేష్ రెడ్డి జగిత్యాల జిల్లా మేడిపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా, మన్నెగూడెం సర్పంచ్ గా కొనసాగుతున్నారు. గతంలో 11 ఏళ్లపాటు సౌదీ లోని అరేబియన్ అమెరికన్ పెట్రోలియం నేచురల్ గ్యాస్ కంపెనీ లో మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో లెవల్-1 సర్టిఫైడ్ రిగ్గర్ గా పనిచేశారు. 'సౌదీ అరామ్కో' కంపెనీలో అత్యంత నైపుణ్యం కలిగిన శ్రామికశక్తి బృందంలో సభ్యుడిగా గుర్తింపు పొందారు.
ఈ సందర్బంగా నరేష్ రెడ్డి మాట్లాడుతూ.. "తెలంగాణ రాష్ట్రానికి చెందిన సుమారు 15 లక్షల మంది గల్ఫ్ దేశాలైన సౌదీ అరేబియా,యూఏఈ, ఒమాన్, ఖతర్, కువైట్, బహ్రెయిన్ లతో పాటు 18 ఈసీఆర్ దేశాలకు ఉపాధి కోసం వలస వెళ్లారు. విదేశాల్లో పనిచేసే కార్మికులకు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడంలో కేంద్ర రాష్ట్ర, ప్రభుత్వాలు విఫలమయ్యాయి.ప్రవాసీ కార్మికుల హక్కుల రక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ అండగా ఉండి పోరాటం చేస్తుంది" అని అన్నారు.
"రాష్ట్ర ప్రభుత్వం.. గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ప్రతి ఏటా రూ.500 కోట్ల బడ్జెట్ కేటాయించాలి. గల్ఫ్ మృతులకు రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలి.కేంద్ర ప్రభుత్వం... హైదరాబాద్ లో సౌదీ అరేబియా,యుఏఈ కాన్సులేట్ లు ఏర్పాటు చేసేలా ప్రయత్నించాలి. ఎన్నారైలు తమ ఓటు హక్కును ఆన్ లైన్ ద్వారా వినియోగించుకునేలా ఏర్పాట్లు చేయాలి. . 10 లక్షల విలువైన 'ప్రవాసి భారతీయ బీమా యోజన' అనే ప్రమాద బీమాలో సహజ మరణం కూడా కవర్ అయ్యేలా చూడాలి.గల్ఫ్ దేశాల నుండి ఇండియా కు ఇటీవల పెంచిన విమాన చార్జీలను తగ్గించాలి" అని డా.బి.ఎం. వినోద్ కుమార్, సింగిరెడ్డి నరేష్ రెడ్డి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.

తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







