భారత్ కరోనా అప్డేట్
- June 28, 2022
న్యూ ఢిల్లీ: భారత్‌లో కొత్తగా 11,793కరోనా కేసులు నమోదయినట్లు కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. కొత్తగా వైరస్ కారణంగా 27 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే, నిన్నటితో పోలిస్తే తాజా కేసులు కాస్త తగ్గుముఖం పట్టగా.. 24 గంటల్లో 9,486 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. కొత్త కేసులతో కలిసి దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,34,18,839కు పెరిగింది. 4,27,87,092 మంది కోలుకున్నారు.వైరస్‌తో 5,25,047 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 96,700 యాక్టివ్ కేసులున్నాయని ఆరోగ్యశాఖ తెలిపింది. దేశంలో ప్రస్తుతం రికవరీ రేటు 98.57శాతంగా ఉందని, మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 0.21శాతం ఉన్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. సోమవారం దేశవ్యాప్తంగా 4,73,717 కొవిడ్ పరీక్షలు నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) తెలిపింది. ఇప్పటి వరకు 86,14,89,40 నమూనాలను పరిశీలించినట్లు చెప్పింది. టీకా డ్రైవ్‌లో భాగంగా ఇప్పటి వరకు 1,97,31,43,196 డోసులు పంపిణీ చేసినట్లు ఆరోగ్యశాఖ వివరించింది.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!