డార్లింగ్ భామతో చరణ్ - శంకర్ సినిమాలో స్పెషల్ సాంగ్.?
- June 28, 2022
డార్లింగ్ ప్రబాస్ కోసం బాలీవుడ్ ముద్దుగుమ్మ జాక్వెలీన్ ఫెర్నాండెజ్ తెలుగులో సందడి చేసింది. ప్రబాస్ నటించిన ‘సాహో’ సినిమాకి ప్యాన్ ఇండియా ఫ్లేవర్ అద్దే క్రమంలో స్పెషల్ సాంగ్ కోసం బాలీవుడ్ బ్యూటీ జాక్వెలీన్ ఫెర్నాండెజ్‌ని ఎత్తుకొచ్చిన సంగతి తెలిసిందే.
‘బ్యాడ్ బోయ్..’ అంటూ సాగే పాటలో, ప్రబాస్ పక్కన ఘాటుగా అందాలరేసేసింది శ్రీలంక బ్యూటీ జాక్వెలీన్ ఫెర్నాండెజ్. అయితే, ఇప్పుడు ఇంకోసారి టాలీవుడ్ తెరపై ‘స్పెషల్’ చిందులేయడానికి జాక్వెలీన్ రెడీ అవుతోందట. ఈ సారి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాకి తన ‘స్పెషల్’ ఫ్లేవర్ అద్దబోతోందట జాక్వెలీన్ ఫెర్నాండెజ్.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కబోయే సినిమా కోసం జాక్వెలీన్‌తో స్పెషల్ సాంగ్ చేయించే యోచనల్లో చిత్ర యూనిట్ వున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయమై అఫిషియల్ క్లారిటీ రానుంది.
కాగా, ఈ సినిమాకి ‘సిటిజన్’ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. కైరా అద్వానీ ఈ సినిమాలో చరణ్‌కి జోడీగా నటిస్తోంది. అత్యాధునిక సాంకేతిక విభాగంతో, విజువల్ వండర్‌గా ఈ సినిమా రూపొందుతోంది. భారీ బడ్జెట్‌తో ప్యాన్ ఇండియా రేంజ్ హంగులు, కళ్లు చెదిరే యాక్షన్ ఘట్టాలను ఈ సినిమా కోసం ప్లాన్ చేశాడట డైరెక్టర్ శంకర్.
ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది ఈ సినిమా.
తాజా వార్తలు
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..