ఫ్యామిలీ, టూరిస్ట్ విజిట్ వీసాలపై కువైట్ కీలక నిర్ణయం..!

- June 28, 2022 , by Maagulf
ఫ్యామిలీ, టూరిస్ట్ విజిట్ వీసాలపై కువైట్ కీలక నిర్ణయం..!

కువైట్ సిటీ: కువైట్ అంతర్గతమంత్రిత్వశాఖ తాజాగా ఫ్యామిలీ, టూరిస్ట్ విజిట్ వీసాలు  విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.తదుపరి నోటీసులు వచ్చేవరకు ఈ వీసాల జారీని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.ఉప ప్రధాని, అంతర్గతశాఖ మంత్రి లెఫ్టినెంట్ జనరల్ షేక్ అహ్మద్ అల్ నవాఫ్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు.సోమవారం నుంచే ఈ నిర్ణయం అమలులోకి వచ్చింది.రెసిడెన్సీ అఫైర్స్ డిపార్ట్‌మెంట్ ఫ్యామిలీ, టూరిస్ట్ విజిట్ వీసాల జారీ కోసం కొత్తగా తీసుకొచ్చిన మెకానిజంను అభివృద్ధి చేస్తున్న నేపథ్యంలో ఈ విరామం ఇచ్చినట్లు సమాచారం.

ఇక మహమ్మారి కరోనా నేపథ్యంలో ఒకటిన్నరేళ్లు కువైట్ విదేశీయులకు ఫ్యామిలీ, టూరిస్ట్ విజిట్ వీసాల జారీని నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో కువైత్ ఈ వీసాల జారీని ఈ ఏడాది ఏప్రిల్‌లో పునరుద్ధరించింది. ఇక ఇప్పటికే ఆ దేశ కేబినేట్ ప్రవాసులకు అన్ని రకాల వీసాల జారీకి గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది.దీంతొ వర్క్ వీసాలతో పాటు కమర్షియల్ విజిట్ వీసా, ఫ్యామిలీ వీసాలను సంబంధిత అధికారులు జారీ చేస్తున్నారు. కానీ, ప్రస్తుతం ఫ్యామిలీ విజిట్, టూరిస్ట్ వీసాలను మాత్రం ఇవ్వడం లేదు. 

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్) 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
Copyrights 2015 | MaaGulf.com