సెయింట్ లూయిస్‌లో అంగరంగ వైభవంగా శ్రీనివాస కల్యాణం
- June 28, 2022అమెరికా: తిరుమల తిరుపతి దేవస్ధానం ఆధ్వర్యంలో ఈరోజ అమెరికాలోని సెయింట్ లూయిస్ లో శ్రీవారి కళ్యాణం వైభంగా జరిగింది.అమెరికా లోని సెయింట్ లూయిస్ నగరంలో ఉన్న ది హిందూ టెంపుల్ ఆఫ్ సెయింట్ లూయిస్ లో భారత కాలమానం ప్రకారం మంగళవారం తెల్లవారుజామున స్వామి వారి కల్యాణ వేడుకను అర్చక స్వాములు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
అద్భుతంగా అలంకరింప బడిన వేదికపై తిరుమల తిరుపతి దేవస్థానముల అర్చక స్వాములు స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను వేంచేపు చేశారు. మంగళ వాయిద్యాలు, భక్తి సంగీత గానం నడుమ శాస్త్రోక్తంగా, వేద మంత్రాలతో అద్భుతంగా ఈ వేడుక నిర్వహించారు.
వేలాది మంది భక్తులు శ్రీవారి కళ్యాణ వేడుక చూసి తరించారు.కళ్యాణం అనంతరం భక్తుల నృత్య ప్రదర్శనల నడుమ గరుడ వాహన సేవ కన్నుల పండువగా నిర్వహించారు.
తాజా వార్తలు
- ఎన్ఆర్ఐ ఖాతాదారులకు శుభవార్త
- బహ్రెయిన్‌లో నకిలీ యూనివర్సిటీలపై కొరడా..!
- పాలస్తీనియన్ బిడ్‌కు UN జనరల్ అసెంబ్లీ మద్దతు
- యూఏఈలో టాప్ 10 ప్రమాదకర రోడ్లు ఇవే..!
- జపాన్‌లో పర్యటించనున్న సౌదీ యువరాజు
- పార్లమెంటును రద్దు చేసిన కువైట్ ఎమిర్
- ఇజ్రాయెల్ ప్రధాని వ్యాఖ్యలను ఖండించిన యూఏఈ
- ఆర్టీసీ ఉద్యోగులు జీన్స్ ప్యాంట్లు, టీషర్ట్స్ వేసుకోకూడదు: ఎండీ సజ్జనార్
- బంపర్ న్యూస్..బంగారం రేట్ భారీగా తగ్గింది
- ఎన్నికల ప్రచారానికి నేటితో తెర