సెయింట్ లూయిస్‌లో అంగరంగ వైభవంగా శ్రీనివాస కల్యాణం
- June 28, 2022
అమెరికా: తిరుమల తిరుపతి దేవస్ధానం ఆధ్వర్యంలో ఈరోజ అమెరికాలోని సెయింట్ లూయిస్ లో శ్రీవారి కళ్యాణం వైభంగా జరిగింది.అమెరికా లోని సెయింట్ లూయిస్ నగరంలో ఉన్న ది హిందూ టెంపుల్ ఆఫ్ సెయింట్ లూయిస్ లో భారత కాలమానం ప్రకారం మంగళవారం తెల్లవారుజామున స్వామి వారి కల్యాణ వేడుకను అర్చక స్వాములు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
అద్భుతంగా అలంకరింప బడిన వేదికపై తిరుమల తిరుపతి దేవస్థానముల అర్చక స్వాములు స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను వేంచేపు చేశారు. మంగళ వాయిద్యాలు, భక్తి సంగీత గానం నడుమ శాస్త్రోక్తంగా, వేద మంత్రాలతో అద్భుతంగా ఈ వేడుక నిర్వహించారు.
వేలాది మంది భక్తులు శ్రీవారి కళ్యాణ వేడుక చూసి తరించారు.కళ్యాణం అనంతరం భక్తుల నృత్య ప్రదర్శనల నడుమ గరుడ వాహన సేవ కన్నుల పండువగా నిర్వహించారు.
తాజా వార్తలు
- ఒమన్ ప్రావిన్స్ లలో భారీగా వర్షం
- విదేశీ ఉద్యోగులకు ఆరోగ్య బీమా కచ్చితంగా ఉండాలి
- గాజా పై దాడిని ఖండించిన సౌదీ అరేబియా
- గజా పై ఇజ్రాయిల్ దాడిని ఖండించిన బహ్రెయిన్
- అనుమతి లేని ప్రదేశంలో ఉన్న పోలీస్ కార్ పై చర్యలు
- ఎయిర్పోర్ట్ ఏరియాలో నడుచుకుంటూ వెళ్లిన ప్రయాణికులు..
- 'TANA' ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు స్కూల్ బ్యాగ్యుల పంపిణీ
- బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో బ్రేక్ ఫాస్ట్ చేసిన టి.గవర్నర్ తమిళిసై
- నింగిలోకి దూసుకెళ్లిన ఎస్ఎస్ఎల్వీ శాటిలైట్
- భారత్ కరోనా అప్డేట్