206వ రోజు చేరుకున్న ఘంటసాల స్వరరాగ మహా యాగం

- June 29, 2022 , by Maagulf
206వ రోజు చేరుకున్న ఘంటసాల స్వరరాగ మహా యాగం

అద్భుతంగా జరిగిన ఘంటసాల స్వరరాగ మహా యాగం 206వ రోజు, పద్మశ్రీ పురస్కార గ్రహీత,  వాగ్గేయకారులు, అమరగాయకులు, స్వాతంత్య్ర సమరయోధులు, సద్గురు ఘంటసాల శతజయంతి సందర్బంగా అంతర్జాలంలో 366 రోజులు జరుగుతున్న ఘంటసాల స్వర రాగ మహా యాగం లో 206 వ రోజున టల్లహాసి,ఫ్లోరిడాలో పనిచేస్తున్న అంతర్జాతీయ గాయని రాధిక నోరి అత్యద్భుతంగా పది పాటలు పాడి అలరించారు.

మోహన రూప గోపాల-కృష్ణప్రేమ; సాగెను జీవిత నావ-తోబుట్టువులు; పలుకరాదటే చిలుక - షాహుకారు; నీవు నేను కలిసిననాడే-శకుంతల; ఆశలే అలలాగా-శభాష్ రాముడు; సరసన నీవుంటే జాబిలి నాకేల-శకుంతల; జాబిల్లి వచ్చాడే పిల్ల-అల్లుడే మేనల్లుడు; ఆడపిల్ల మగవాడు కలిసినప్పుడు-ప్రతిజ్ఞాపాలన; సొగసుకిల్జెడదానా-బొబ్బిలియుద్ధం; దొంగచూపులు చూసి-కలవారి కోడలు... పాటలు పాడారు. 

స్వర్ణోత్సవాలు జరుపుకుంటున్న వంశీ ఆర్ట్స్ థియేటర్స్ ఇండియా, వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని శుభోదయం మీడియావారు డిసెంబరు 4  వరకు అంతర్జాలంలో ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. 206 వ రోజు కార్యక్రమానికి ఖతార్ నుంచి శ్రీమతి పద్మజ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. వంశీ గ్రూపు వ్యవస్థాపకులు వంశీ రామరాజు, రాధిక మంగిపూడి, ప్రసన్న నిర్వహణలో జరుగుతున్న ఈ 366 కార్యక్రమాల్లో దేశవిదేశాల నుంచి మూడేళ్ళ వయసు నుంచి తొంభై ఏళ్ళ వయసు వరకు ఘంటసాలగారి పాటలను పాడటం ఒక విశేషం. లయన్ డా.శ్రీ లక్ష్మీప్రసాద్, చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్, శుభోదయం గ్రూప్, డా.వంగూరి చిట్టెన్ రాజు, రత్నకుమార్ కవుటూరు సారధ్యంలో ఈ చారిత్రాత్మకమైన కార్యక్రమం జరుగుతోంది. ఇవాళ ఈ 206 వ రోజున రాధిక నోరి ఘంటసాలగారి  పది పాటలు అద్భుతంగా పాడి యూట్యూబులో చూస్తున్నవారిని, వింటున్నవారిని కూడా మంత్రముగ్ధులను చేసారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com