91 ఏళ్లు జైలు శిక్ష విధించిన పబ్లిక్ ప్రాసిక్యూషన్
- June 29, 2022
రియాద్: తాము చేసిన తాసత్తూర్ మరియు మనీలాండరింగ్ ను కప్పిపుచ్చుకోవడానికి నేరస్తులు పలు నేరాలకు పాల్పడ్డారని రుజువు కావడంతో సౌదీ పబ్లిక్ ప్రాసిక్యూషన్ 17 మంది దేశ పౌరులు మరియు నివాసితులను నిందితులుగా గుర్తించి 91 ఏళ్లు జైలు శిక్ష విధించింది.
పబ్లిక్ ప్రాసిక్యూషన్ అధికార వర్గాల నుండి వెలువడిన సమాచారం ప్రకారం నేరస్తులు తమ అక్రమంగా సంపాదించిన డబ్బును ప్రభుత్వం కళ్లు గప్పి విదేశాలకు తరలించేందుకు ముందు వివిధ పేర్లతో బ్యాంకు ఖాతాలు తెరిచి అందులో జమ చేయడమే కాకుండా ఆ పై వాటిని దేశం వెలుపల బదిలీ చేశారని పేర్కొన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో నిందితులకు సౌదీ అరేబియా దేశ పౌరులతో పాటుగా నివాసితులు తమ పేర్లతో బ్యాంకు ఖాతాలు తెరిచేందుకు సహకరించినట్లు పరిశోధనల్లో వెల్లడైంది.
ఆర్థిక నేరాలను విచారించేందుకు పబ్లిక్ ప్రాసిక్యూషన్ ప్రత్యేక న్యాయవాద బృందాన్ని నియమించింది. ఈ బృందం కేసు పై సమర్థవంతంగా విచారణ జరిపిన పిమ్మట వీరిని దోషులుగా నిర్ధారిస్తూ ఇచ్చిన తీర్పుతో పాటు పలు జరిమానాలు విధించడం జరిగింది. అవి ఇలా ఉన్నాయి:
1. నేరస్తులకు 91 సంవత్సరాలు పాటు కఠినమైన కారాగార శిక్ష విధించడం.
2. మనీ లాండరింగ్ కార్యకలాపాల్లో నేరస్తులు వినియోగించిన డబ్బు విలువకు సమానమైన జప్తు యొక్క జరిమానా విధించించబడుతుంది. ఇది దాదాపు SR 1,745,000,000 కంటే చాలా ఎక్కువ.
3. నిందితుల ఆధీనంలో ఉన్న నగదును స్వాధీనం చేసుకుని జప్తు చేసినందుకు గాను జరిమానా విధించబడుతుంది. ఇది సుమారు SR 1,800,000 .
4. వాణిజ్య సంస్థల బ్యాంకు ఖాతాల్లో జప్తు చేయబడిన జరిమానా మొత్తం SR 1,599,000.
5. నేరం చేసేందుకు ఉపయోగించిన ప్రతి వస్తువును జప్తు చేయడంతో పాటుగా నేరస్తులను శిక్షించడం.
6. చేసిన నేరాలకు గాను SR 800,600,000 జరిమానా విధించడం.
7. నిందితులుగా గుర్తించిన సౌదీ పౌరులను వారికి కారాగార శిక్ష కాల వ్యవధికి సమానమైన వ్యవధిలో ఎటువంటి ప్రయాణాలు చేయకుండా నిరోధించడం.
8. శిక్షా కాలం పూర్తయిన తర్వాత నివాసితులను సౌదీ అరేబియా నుండి శాశ్వతంగా బహిష్కరించడం.
9. నేరస్తులతో ఎటువంటి వాణిజ్య కార్యకలాపాలు మరియు రాత కోతలు నిర్వహించకుడదు.
ఈ క్రమంలో సౌదీ అరేబియా యొక్క ఆర్థిక వ్యవస్థను బలహీనపరిచే ఆర్థిక నేరాలను ఉక్కు పాదంతో అణిచివేసేందుకు పబ్లిక్ ప్రాసిక్యూషన్ అధికారికంగా ప్రకటించింది.అంతే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థను అన్ని విధాలుగా రక్షించడానికి తమ వంతు ప్రయత్నం ఎల్లప్పుడూ కొనసాగుతుందని కూడా పేర్కొనడం జరిగింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..