మహారాష్ట్ర సీఎంగా ఏక్నాథ్ షిండే ప్రమాణం..
- June 30, 2022
ముంబై: శివసేన తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.అలాగే, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం గమనార్హం.వారితో రాజ్‌భవన్‌లో మహారాష్ట్ర గవర్నర్ కోశ్యారీ ప్రమాణ స్వీకారం చేయించారు.కేబినెట్లో తాను ఉండబోనని దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పినప్పటికీ ఆయన ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం గమనార్హం.
ఈ కార్యక్రమానికి పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఆటోడ్రైవర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన ఏక్నాథ్ షిండే 1980 దశకంలో అప్పటి శివసేన థానె అధ్యక్షుడు ఆనంద్ దిగ్జే మద్దతుతో ఆ పార్టీలో చేరారు. 2004 నుంచి వరుసగా నాలుగుసార్లు షిండే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఉద్ధవ్ ఠాక్రే కేబినెట్లో ఆయన మంత్రిగా కొనసాగారు. చివరకు ఉద్ధవ్ ఠాక్రేకు షాక్ ఇస్తూ షిండే తిరుగుబాటు చేయడంతో మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం కుప్పకూలింది. అయితే, ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా, ఏక్ నాథ్ షిండే ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని అందరూ భావించగా అది జరగలేదు. ముఖ్యమంత్రి పదవి షిండేకు, ఉప ముఖ్యమంత్రి పదవి ఫడ్నవీస్ కు దక్కింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల
- డ్రగ్స్ కేసుల్లో చిక్కుకున్న విదేశీయులను వెనక్కి పంపనున్న కేంద్రం
- టీటీడీ ఈవోకు శుభాకాంక్షలు తెలిపిన టిటిడి పాలక మండలి
- చరిత్ర సృష్టించిన యూఏఈ కెప్టెన్ ముహమ్మద్ వసీం..