సాయి పల్లవి ఇంకా మర్చిపోలేకపోతోందట.!

- July 01, 2022 , by Maagulf
సాయి పల్లవి ఇంకా మర్చిపోలేకపోతోందట.!

లేడీ పవర్ స్టార్‌గా ఫ్యాన్స్‌తో ప్రశంసలు దక్కించుకుంటోంది అందాల భామ సాయి పల్లవి. నిజమే, ఆ ప్రశంసలకు సాయి పల్లవి అర్హురాలే. ఎందుకంటే, సాయి పల్లవి ఏ పాత్ర చేసినా ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేస్తుంటుంది. ఆ పాత్ర తీరు తెన్నులను చాలా కాలం ఆమె బాడీ లాంగ్వేజ్ నుంచి పోగొట్టుకోదు.

మొన్న ‘శ్యామ్ సింఘరాయ్’ సినిమాలో దేవదాసి పాత్ర పోషించింది సాయి పల్లవి. ఆ పాత్ర తాలూకు ఛాయల్లోనే చాలా కాలం వుండిపోయింది. ప్రమోషన్లలో ఆ పాత్ర ఛాయల్ని మిళితం చేసి కనిపించేది. ఇప్పుడు ‘విరాట పర్వం’ సినిమాలో వెన్నెల పాత్ర తాలూకు జ్ఞాపకాల్ని ఇంకా మర్చిపోలేకపోతోందట సాయి పల్లవి.
‘విరాట పర్వం’ సినిమాని సాయ పల్లవి వైపు నుంచే ప్రమోట్ చేసిన సంగతి తెలిసిందే. విడుదలకు ముందు, తర్వాత కూడా ఈ సినిమా వివాదాలు వెంటాడాయి. కానీ, సినిమా ధియేటర్‌లో ఫెయిలైంది. ఇప్పుడు ఓటీటీ వేదికగా నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వచ్చింది ‘విరాట పర్వం’.

ఈ సందర్భంగా ఓటీటీలో తన సినిమాని తప్పకుండా చూడండి.. అంటూ సాయి పల్లవి తన ట్విట్టర్ వేదికగా ఫ్యాన్స్‌కి సూచించింది. అలాగే, వెన్నెల పాత్రను తాను ఎప్పటికీ మర్చపోలేననీ అంత గొప్ప పాత్రలో నటించడం తన అదృష్టం అనీ, ఆ అదృష్టానికి కారణం రానా, డైరెక్టర్ వేణు ఉడుగుల.. వాళ్లకి తానెప్పుడూ రుణపడి వుంటానని సాయి పల్లవి చెప్పుకొచ్చింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com