భారత్ కరోనా అప్డేట్
- July 05, 2022
న్యూ ఢిల్లీ: భారత్‌లో కరోనా కేసుల సంఖ్య తగ్గింది. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు 13,086 మంది వైరస్ బారినపడగా.. మరో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. రోజువారీ కేసుల సంఖ్య సోమవారంతో పోలిస్తే 3వేల వరకు తగ్గింది. కొవిడ్ నుంచి 12,456 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.53 శాతానికి చేరింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 0.26 శాతం వద్ద స్థిరంగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.90శాతానికి పడిపోయింది.
భారత్‌లో సోమవారం 11,44,805 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,98,09,87,178కు చేరింది. మరో 4,51,312 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు. ప్రపంచదేశాల్లో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. కొత్తగా 4,76,637 మంది వైరస్ బారినపడ్డారు. మరో 804 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 55,51,67,797కు చేరింది. మరణాల సంఖ్య 63,62,347 చేరింది. ఒక్కరోజే 6,59,745 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 52,98,96,665కు చేరింది.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..