10 రోజుల్లోనే కొత్త వర్క్ వీసా
- July 05, 2022
కువైట్ సిటీ: విదేశాల నుంచి తీసుకువచ్చే ప్రవాస కార్మికులకు వర్క్ పర్మిట్‌లను జారీ చేసే ప్రక్రియను వేగవంతం చేసేందుకు సంబంధిత అధికారులతో పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్ సమన్వయం చేసుకుంటోంది. కొత్త వర్క్ వీసాల జారీకి కోసం తీసుకువస్తున్న నూతన విధానం ద్వారా ప్రస్తుతం తీసుకుంటున్న 3 నెలలకు బదులుగా గరిష్టంగా 10 రోజులు మాత్రమే పడుతుందని తెలిపింది. కొత్త విధానాన్ని దమాన్ హెల్త్ ఇన్సూరెన్స్ హాస్పిటల్స్ కంపెనీ సహకారంతో తీసుకువస్తున్నట్లు పేర్కొంది.ఇది ప్రవాసుల కోసం లేబర్ అవుట్‌సోర్సింగ్ దేశాలతో ఆమోదించబడిన ఆసుపత్రులతో సమన్వయం చేస్తుంది.
ప్రస్తుతం మెడికల్ పరీక్షలకు మొత్తం 4 రోజులు పడుతుంది. వీటిలో బర్త్ కంట్రీలో 2 రోజులు, వచ్చిన తర్వాత 2 రోజులు పడుతుంది. దీనిలో భాగంగానే విదేశాల నుంచి తీసుకొచ్చిన కార్మికుల వైద్య పరీక్షల ప్రక్రియను వేగవంతం చేసేందుకు కొత్త యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను అథారిటీ డైరెక్టర్ల బోర్డు అధ్యయనం చేస్తోంది.ప్రధానంగా లేబర్ పరీక్ష కేంద్రాల వద్ద పొడవైన క్యూలను తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకుంది.ఇక గత నెలరోజుల నుంచి లేబర్ పరీక్ష కేంద్రాల వద్ద రద్దీ, తొక్కిసలాట దృశ్యాలు కనిపిస్తున్నాయి.దీంతో పరీక్ష అనంతం ఫలితాలను పొందడానికి ఒక నెల పడుతుంది. ఈ ఆలస్యాన్ని నివారించడానికి కొత్త విధానాన్ని తీసుకువస్తుంది. అయితే, ఈ కొత్త సేవ కోసం చార్జీలు ప్రస్తుతము కంటే ఎక్కువగానే ఉంటాయని, ఇది ఐచ్ఛిక విధానంగా పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్ వెల్లడించింది.
తాజా వార్తలు
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..