మెగా వీడియో: ‘గాడ్ ఫాదర్’ వచ్చేశాడహో.!
- July 05, 2022
మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం ‘గాడ్ ఫాదర్’కి సంబంధించి టీజర్ రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. టీజర్ చూసేందుకు మెగా అభిమానులకు రెండు కళ్లూ చాలడం లేదంటే అతిశయోక్తి కాదేమో. చుట్టూ జన సందోహం.. రెట్రో మోడల్ అంబాసిడర్ కారులోంచి దిగుతున్న చిరంజీవి.. ఈ సీన్ చూస్తే గూస్ బంప్ప్ వచ్చేస్తున్నాయంతే.. అంటూ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు.
సునీల్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. కారు ముందు సీట్‌లోంచి సునీల్ దిగి, వెనక డోర్‌లో కూర్చొన్న బాస్‌కి డోర్ ఓపెన్ చేయడం, బ్లాక్ కుర్తా, కళ్లకు గాగుల్స్ ధరించిన చిరంజీవి అలా కారులోంచి దిగి నడుచుకుంటూ వస్తున్న సన్నివేశమది. బ్యాక్ గ్రౌండ్‌లో తమన్ ఆర్ఆర్ అద్దిరిపోయిందంతే. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది.
ఈ సినిమాలో చిరంజీవి గెటప్‌పై సర్వత్రా వుత్కంఠ నెలకొన్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు రిలీజ్ చేసిన ఈ తాజా వీడియోతో సినిమాలో చిరంజీవి గెటప్‌పై ఓ క్లారిటీ వచ్చేసింది. అంచనాలకు మించి చిరంజీవి ఎంట్రీ సీన్ దుమ్ము రేపుతోంది. మలయాళ మూవీ ‘లూసిఫర్’ కి రీమేక్‌గా రూపొందుతోన్న సినిమా ‘గాడ్ ఫాదర్’. ఒరిజినల‌్‌లో మోహన్ లాల్ ఈ పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.
మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్ పోషిస్తున్నాడు. నయనతార మరో కీలక పాత్రలో కనిపించనుంది. అతి త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్‌లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







