చైతూ కోసం నిఖిల్ వెనక్కి వెళతాడా.? లేదా.?

- July 05, 2022 , by Maagulf
చైతూ కోసం నిఖిల్ వెనక్కి వెళతాడా.? లేదా.?

చైతూ ప్రస్తుతం ‘థాంక్యూ’ సినిమాలో నటిస్తున్నాడు.రాశీఖన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకి విక్రమ్ కుమార్ దర్శకుడు.కాగా, ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో కొంత సందిగ్ధత ఏర్పడింది. 

ఈ సినిమాని ఆగస్ట్‌లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఆగస్ట్ 22 అనే డేట్‌ని లాక్ చేశాడట నిర్మాత దిల్ రాజు. అయితే, అదే రోజు ఆల్రెడీ నిఖిల్ సిద్దార్డ్ హీరోగా రూపొందిన ‘కార్తికేయ 2’ విడుదలకు సిద్ధంగా వుంది.ఈ సినిమాపై నిఖిల్ బోలెడన్ని ఆశలు పెట్టుకున్న సంగతి తెలిసిందే.

కానీ, నిఖిల్‌ని వెనక్కి తగ్గాలంటూ, దిల్ రాజు అండ్ టీమ్ ‘కార్తికేయ 2’ మేకర్లతో మంతనాలు జరుపుతున్నారట. ‘లవ్ స్టోరీ’ సినిమా తర్వాత నాగ చైతన్య నుంచి వస్తున్న సినిమా కావడంతో, ‘థాంక్యూ’ సినిమాపై అంచనాలున్నాయి. 

అయితే, ఆ అంచనాల్ని అందుకోవాలంటే, వీలైనంత త్వరగా సినిమా రిలీజ్ కావల్సి వుంది. ఇప్పటికే అనుకున్నషెడ్యూల్‌ని మించి ఆలస్యమవుతూ వస్తోంది ఈ సినిమా. ఈ సారి ఇక లేట్ చేయకూడదని ‘థాంక్యూ’ టీమ్ భావిస్తోందట. మరి, నిఖిల్ తగ్గుతాడా.? లేదా.? అనేది వెయిట్ అండ్ సీ.!

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com