భారతీయ విద్యార్థులపై కూడా త్వరలోనే చర్యలు ...

- April 12, 2016 , by Maagulf
భారతీయ విద్యార్థులపై కూడా త్వరలోనే చర్యలు ...

 అక్రమంగా దేశంలో ఉండాలని చూస్తున్న 306 మంది భారత విద్యార్థులపై తగిన చర్యలు తీసుకుంటామని అమెరికా స్పష్టం చేసింది. వీసా పొడగింపునకు అర్హత సాధించని.. 306 మంది విద్యార్థులు నకిలీ విశ్వవిద్యాలయాల ద్వారా ప్రవేశాలు పొంది దేశంలో ఉండిపోవాలని చూస్తున్నారని ఇటీవల ఓ స్టింగ్‌ ఆపరేషన్‌లో తేలిన సంగతి తెలిసిందే.హోంల్యాండ్‌ సెక్యూరిటీ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ నిర్వహించిన స్టింగ్‌ ఆపరేషన్‌లో అక్రమంగా ఉంటున్న విద్యార్థుల వివరాలు బయటపడ్డాయి. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు.. విద్యార్థులకు ప్రవేశాలు కల్పించిన 32 మంది మధ్యవర్తులను వారిని అరెస్టు చేశారు. ఇందులో 11 మంది భారత సంతతికి చెందినవారున్నారు. భారతీయ విద్యార్థులపై కూడా త్వరలోనే చర్యలు తీసుకుంటామని అమెరికా వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com