‘ఆర్ఆర్ఆర్’ ‘గే’ లవ్ స్టోరీనా.? ఇదెక్కడి ‘గొడవ’ రా బాబూ.!
- July 06, 2022
‘ఆర్ఆర్ఆర్’ సినిమా అంటే, ఇద్దరు వీరుల గాధ. వేర్వేరు కాలాల్లోని ఇద్దరు వీరులను ఒకే కాలానికి తీసుకొచ్చి, వారి మధ్య స్నేహాన్ని చిగురింపచేసి, ఆ కథను అద్భుతమైన విజువల్ కావ్యంలా తీర్చి దిద్దిన ఘనత జక్కన్న రాజమౌళిది.
అందుకే ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకి విమర్శలు దక్కాయ్. వేల కోట్లలో లాభాలూ దక్కాయ్. అలాంటి ‘ఆర్ఆర్ఆర్’పై ఓ వింత వివాదం తెరపైకి వచ్చింది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాని ‘గే’ లవ్ స్టోరీగా అభివర్ణిస్తూ, రెసూల్ పోకుట్టి అనే వ్యక్తి సోషల్ మీడియాలో రచ్చకెక్కాడు.
ఇంతకీ ఎవరీ రెసూల్ పోకుట్టి.? అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న ఆడియోగ్రఫీ సౌండ్ స్పెషలిస్ట్ ఈయన. ఆస్కార్ విజేత కూడా. ఎవరో, ఎక్కడో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాని గే లవ్ స్టోరీ అని అభివర్ణిస్తే, దాన్ని ఈ మేథావి గారు సమర్ధిస్తూ, ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టాడు.
దాంతో వివాదం చెలరేగింది. రెసూల్‌పై ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకుంటున్నాయ్. ‘ఆర్ఆర్ఆర్’ నిర్మాత శోభు యార్లగడ్డ ఈయన గారికి గట్టిగానే కౌంటర్ ఇచ్చాడనుకోండి. ఎవరో ఏదో వాగితే, నీ బుద్ధి ఏమైంది.? అంటూ శోభు యార్లగడ్డ గడ్డి పెట్టాడు.
దాంతో, తాను అలా అనలేదనీ, రెసూల్ మాట మార్చేశాడు. అయినా ఈ రచ్చ ఆగేలా లేదు. ‘ఆర్ఆర్ఆర్’ టెక్నీషియన్లే కాదు, ఆడియన్స్ కూడా తమకు తోచిన విధంగా రెసూల్‌ని ఓ పట్టు పట్టేస్తున్నారు సోషల్ మీడియా వేదికగా. చూడాలి మరి, ఈ రచ్చ ఎంత దూరం వెళుతుందో.!
తాజా వార్తలు
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు







