సాంగ్ రిలీజ్‌కి కూడా ఈవెంటా.? ఇదెక్కడి చోద్యం గురూ.!

- July 06, 2022 , by Maagulf
సాంగ్ రిలీజ్‌కి కూడా ఈవెంటా.? ఇదెక్కడి చోద్యం గురూ.!

జరుగుబడి వుంటే, జ్వరం ఎంత మజాగా వుంటుందోనట. అలాగే వుంది సినిమా ఈవెంట్ల పరిస్థితి. ఒక్క సినిమా ఫంక్షన్ చేయాలంటేనే బోలెడంత ఖర్చుతో కూడుకున్న పని. అలాంటిది జస్ట్ సాంగ్ రిలీజ్ ‌కోసం కూడా ఓ స్పెషల్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారీ హీరోగారు.
ఇంతకీ ఎవరా హీరో.? ఏంటా కథ.? అంటారా.. హీరో నితిన్. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘మాచర్ల నియోజక వర్గం’ . కృతిశెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.

కాగా, ఈ సినిమా నుంచి ఓ స్పెషల్ సాంగ్ రిలీజ్ చేస్తున్నారు. ఆ సాంగ్ రిలీజ్ కోసం శ్రీకాకుళంలో ఓ ఈవెంట్ ప్లాన్ చేశారు. ‘మాస్ మ్యూజిక్ జాతర’ అంటూ ఆ ఈవెంట్‌కి ఓ పేరు కూడా పెట్టేశారు. జూలై 9న ఈ ఈవెంట్‌ని గ్రాండ్‌గా ప్లాన్ చేశారు.
‘రా రా రెడ్డి.. ఐ యామ్ రెడీ..’ అంటూ సాగే ఈ పాటలో తెలుగమ్మాయ్ అంజలి, నితిన్‌తో కలిసి మాస్ స్టెప్పులిరగదీసింది. ఈ పాట సినిమాకి చాలా పెద్ద హైలైట్ అవుతుందని చిత్ర యూనిట్ నమ్ముతోంది.

కాగా, సొంత బ్యానర్ అయిన శ్రేష్ట్ మూవీస్ పతాకంపై నితిన్ రూపొందిస్తున్న సినిమా ఇది. ఎంత సొంత బ్యానర్ అయితే మాత్రం స్పెషల్ సాంగ్ రిలీజ్ కోసం స్పెషల్ ఈవెంట్ ఏంటీ బాస్.. అంటూ నితిన్‌ని ట్రోల్ చేస్తున్నారు. అంతేగా మరి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com