యజమానిని చంపిన వ్యక్తికి మరణశిక్ష ఖరారు
- July 07, 2022
యూఏఈ: తన యజమానిని హత్య చేసిన కేసులో 30 ఏళ్ల ఆసియా వ్యక్తికి అజ్మాన్ క్రిమినల్ కోర్టు మరణశిక్ష విధించింది. ఘటనా స్థలంలో ఉన్న నిఘా కెమెరాల్లో ఈ దారుణానికి సంబంధించిన వివరాలు రికార్డయ్యాయి. కోర్టు ఫైల్స్ ప్రకారం.. అజ్మాన్ సెంటర్లోని ఫలహారశాల సమీపంలో కత్తిపోటు సంఘటన చోటు చేసుకుంది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకునే సమయానికే బాధితుడు మృతి చెందాడు. బాధితుడిని నిందితుడు వెంబడించి పలుమార్లు కత్తితో పొడిచి పారిపోయినట్లు సీసీ ఫుటేజీ ద్వారా ధృవీకరించారు. పబ్లిక్ ప్రాసిక్యూషన్ నిందితుడిని ప్రశ్నించగా.. తమ దేశానికే చెందిన కంపెనీ యజమానిని ఉద్దేశపూర్వకంగా హత్య చేసినట్లు నిందితుడు అంగీకరించాడు. బాధితుడు తనను ఉద్యోగం చేసేందుకు టూరిస్ట్ వీసాపై యూఏఈకి తీసుకొచ్చాడని, అలాగే తమ దేశం నుంచి మరింత మంది కార్మికులను తీసుకురావడానికి ఒప్పందం చేసుకున్నాడని తెలిపాడు. ఈ క్రమంలో తొమ్మిది మందికి వీసాలు ఇప్పించేలా తమ మధ్య ఒప్పందం కుదిరిందని నిందితుడు పేర్కొన్నారు. కానీ తొమ్మిది మందికి రెసిడెన్సీ ప్రక్రియలను పూర్తి చేసేందుకు మృతుడు నిరాకరించాడని, పైగా నాలుగు నెలలుగా వారికి జీతాలు ఇవ్వలేదని నిందితుడు పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు తెలియజేశాడు.
తాజా వార్తలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!







