బిజినెస్ చేసేందుకు ప్రభుత్వ ఉద్యోగులకు ఏడాదిపాటు సెలవులు
- July 08, 2022
యూఏఈ: ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న పౌరులు తమ సొంత వ్యాపారాలను ప్రారంభించడానికి ఒక సంవత్సరం వరకు సెలవు తీసుకోవచ్చని యూఏఈ ప్రకటించింది. ఎమిరాటీలు తమ ప్రభుత్వ ఉద్యోగాలను కొనసాగిస్తూనే సెలవు తీసుకోవచ్చని పేర్కొంది. సెలవుల కాలంలో సగం జీతాలను పొందుతారని తెలిపింది. పౌరులు వ్యాపారాలు చేసే దిశగా సాగేలా ప్రోత్సహించడం ఈ పథక లక్ష్యమని వెల్లడించింది. ఈ మేరకు యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో నిర్ణయించారు. భారీ వాణిజ్య అవకాశాలను సద్వినియోగం చేసుకునేలా యువతను ప్రోత్సహించడమే ఈ పథక ప్రధాన లక్ష్యమని షేక్ మహ్మద్ చేసిన ట్వీట్ లో పేర్కొన్నారు. చమురుయేతర ఎగుమతుల్లో దేశం 47 శాతం వృద్ధిని.. విదేశీ పెట్టుబడుల్లో 16 శాతం పెరుగుదల, కొత్త కంపెనీల సంఖ్య 126 శాతం పెరిగిందని షేక్ మహ్మద్ తెలిపారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







