నిజామాబాద్ నుంచి తిరుపతికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
- July 08, 2022
నిజామాబాద్: తిరుమల శ్రీవారి భక్తుల కోసం నిజామాబాద్ నుంచి తిరుపతికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ప్రారంభించింది. నిజామాబాద్ నుంచి తిరుపతికి ప్రత్యేక దర్శన బస్సుల సౌకర్యాన్ని టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమలకు వెళ్లే భక్తులకు ఇదొక సువర్ణ అవకాశం అన్నారు. నిజామాబాద్ నుంచి తిరుపతికి మూడు బస్సులతో పాటు దర్శనం సౌకర్యాన్ని కూడా ఆర్టీసీ ద్వారా కల్పిస్తున్నామని చెప్పారు.
ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. తెలంగాణకు ప్రతిరోజు వెయ్యిమందికి ఆర్టీసీ ద్వారా దర్శనం కల్పించనున్నామని తెలిపారు. ఆర్టీసీలో ప్రయాణం సురక్షితం సౌకర్యవంతం అన్నారు. సంస్థను లాభాల బాటలో తీసుకొచ్చేందుకు ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు. ప్రజలు ఆర్టీసీని ఆదరించి కాపాడుకోవాలన్నారు.
ఇవాళ నిజామాబాద్‌లో ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ జెండా ఊపి ప్రత్యేక బస్సులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ విట్టల్ రావు, ఆర్టీసీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆర్టీసీ బస్సులో తిరుమల వెళ్లే భక్తులకు బస్ టికెట్‌తో పాటు రూ.300 శీఘ్ర దర్శన టోకెన్ అందిస్తారు.
తిరుపతి నుంచి తిరుమలకు అక్కడి స్థానిక బస్సులో తీసుకెళ్లి ఉదయం 10 గంటలకు శీఘ్ర దర్శనం కల్పించనున్నారు. వారం ముందు http://www.tsrtconline.in నుంచి టికెట్లను బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈ నెల 1న హైదరాబాద్ నుంచి తిరుపతికి ఆర్టీసీ సేవలు మొదలైన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు







