ముంబై-బహ్రెయిన్ మధ్య ఇండిగో విమాన సర్వీసులు

- July 09, 2022 , by Maagulf
ముంబై-బహ్రెయిన్ మధ్య ఇండిగో విమాన సర్వీసులు

బహ్రెయిన్: ప్రైవేట్ క్యారియర్ ఇండిగో జూలై 6న బహ్రెయిన్‌ను తన 25వ అంతర్జాతీయ విమాన గమ్యస్థానంగా చేర్చినట్లు ప్రకటించింది. ఆగస్టు 1 నుండి ముంబై-బహ్రెయిన్ మధ్య రోజువారీ విమానాలను నడుపనున్నట్లు పేర్కొంది. ముంబై నుండి విమానం( 6E 1403)  ప్రతిరోజూ రాత్రి 10:15 (IST)కి బయలుదేరి రాత్రి 11:35 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) బహ్రెయిన్ చేరుకుంటుంది. బహ్రెయిన్-ముంబై ఫ్లైట్( 6E 1404) మరుసటి రోజు ఉదయం 01:00 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) బయలుదేరి.. ఉదయం 07:20 గంటలకు (IST) ముంబై చేరుకుంటుంది. ఈ కొత్త విమాన సర్వీసులు అంతర్జాతీయ కనెక్టివిటీని మెరుగుపరుస్తాయని, భారతదేశం-బహ్రెయిన్ మధ్య వాణిజ్యం, పర్యాటకాన్ని బలపరుస్తాయని ఇండిగో చీఫ్ స్ట్రాటజీ, రెవెన్యూ ఆఫీసర్ సంజయ్ కుమార్ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com